కృష్ణ

సేవా రంగాన్ని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: రాష్ట్రంలో సేవా రంగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మొత్తం జిఎస్‌డిపిలో 15 శాతం సేవా రంగం నుంచి వస్తున్నదన్నారు. బ్యాంకింగ్, వైద్యం, ఆరోగ్యం, పర్యాటకం, ఐటి రంగాల్లో ఈ మేరకు మరింత వృద్ధి నమోదు కావాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాల కల్పన కేవలం సేవా రంగంలోనే సాధ్యం అవుతుందన్నారు. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు, షాపింగ్ సెంటర్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఎక్కువగా ఆకర్షిస్తాయన్నారు. పట్టణీకరణ పెరిగితే సేవా రంగం కూడా పెరుగుతుందన్నారు. సేవారంగాన్ని ప్రోత్సహించాలన్నారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా 2300 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించి చదివిస్తున్నప్పటికీ, ప్రచారం మాత్రం జరగడం లేదన్నారు. తల్లితండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలియడం లేదన్నారు. ఈ పథకం పేరు కూడా మార్చాలన్నారు. కాపు, బిసి భవనాలకు స్థలం కేటాయించినప్పటికీ, ఇంకా టెండర్లు పిలవడం లేదని ఉప ముఖ్యమంత్రి (హోం)చినరాజప్ప తెలిపారు. పట్టణాలకు దూరంగా నిర్మించడంపై వ్యతిరేకత రావడంతో కొంత జాప్యం జరిగిందని, త్వరలోనే డిజైన్‌లను ఖరారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై సిఎం చంద్రబాబు స్పందిస్తూ ఖర్చు వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయన్న దానిపై దృష్టి సారించాలన్నారు. ఫలితాలపై మదింపు జరగాలన్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్‌గా చెప్పుకుంటున్నామంటూ కళాశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నామని, ఫలితాలను ఎన్నడైనా పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. ముందుగా చర్చించి సరైన ప్రతిపాదనలతో తన వద్దకు రావాలని అచ్చెన్నాయుడుకు తెలిపారు. గ్రామాల్లో అసమానతలు తలెత్తకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాల అమలు ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు.

బిచ్చగాళ్లు లేకుండా....
రాష్ట్రంలో బిచ్చగాళ్లు లేకుండా చూడాలని అధికారులకు సిఎం తెలిపారు. ఏ మేరకు మరింతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఈ సమస్యను అధిగమించవచ్చో, ఎలా చేయాలో ఆలోచించాలని అధికారులను కోరారు. పందులకు పునరావాసం, యానిమల్ హాస్టల్ ఏర్పాటు పరిశీలించాలన్నారు. సుస్థిర సమ్మిళిత వృద్ధి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ ఫెర్మామెన్సు ఇండికేటర్లపై అధికారులకు అవగాహన కల్పించేందుకు విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. రహదారులు, భవనాల శాఖకు సంబంధించి సిఎం మాట్లాడుతూ రోడ్ల రఫ్‌నెస్ ఇండెక్స్ 3.5 నుంచి 4కు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనందపురం-అనకాపల్లి రహదారికి సంబంధించి భూములకు నష్టపరిహారం చెల్లింపులో మార్కెట్ ధరకు రెండు రెట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నప్పటికీ, కేంద్రం 1.25 రెట్ల కన్నా ఎక్కువ చెల్లించవద్దన్నదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సిఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందిస్తూ, అదనంగా చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సిఎం తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ వారానికి ఆరు రోజులు పని చేసేందుకు తమను అనుమతించాలని సిఎంను కోరారు. స్వయం ఉపాధికి సంబంధించి లక్ష రూపాయల రుణాన్ని లబ్ధిదారులకు నిజంగా వ్యాపారంలో ఆసక్తి ఉందా.. లేదా.. అని పరిశీలించాకే మంజూరు చేస్తున్నామన్నారు. ఈ పరిశీలన వల్ల 40 శాతం మేరకు బోగస్ దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనిని ఇతర శాఖలు గమనించాలని సూచించారు. నాలుగో త్రైమాసికంలో నిధుల విడుదలలో సమస్యను దృష్టిలో ఉంచుకుని, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేసేందుకు వీలుగా పిడి అక్కౌంట్‌లో కొంత మొత్తం ముందుగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని సిఎంను కోరారు.