కృష్ణ

ప్రతి ఆదివారం హ్యాపీ సండే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మే 28: జూన్ 4నుండి ప్రతీ ఆదివారం హ్యాపీ సండే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. దీనికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్‌లు, పంచాయతీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే త్వరలో జిల్లా వ్యాప్తంగా శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదివారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలసి ఆయన టెలీకాన్ఫరెన్సును నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో జూన్ 4నుండి నెలలోని మొదటి ఆదివారం హ్యాపీసండేగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో స్థానికంగా ప్రసిద్ధి చెందిన కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలతో పాటు ముఖ్యంగా ఆటపాటలతో యువత ఆనందోత్సాహాలతో పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నెలలో మొదటి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం 6.30 నిముషాల నుండి 8.30 నిముషాల వరకు నిర్వహించాలన్నారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలలో ఆనంద ఆదివారం నిర్వహించాలని సూచించారు. యువతలో స్ఫూర్తిని నింపి మానసిక ఉల్లాసం కలిగించేలా, ఒత్తిడిని తగ్గించి శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు ఆనంద ఆదివారం ఉపయోగపడుతుందన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని గ్రామ పంచాయతీలలోని మంచినీటి చెరువులను క్లోరినైజేషన్ ద్వారా శుభ్రపరచడం ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్యాయర్‌లను క్లోరినైజేషన్ చేసి స్వచ్ఛమైన మంచినీటిని అందించేలా చర్యలు చేపట్టాలని టెలీ కానె్ఫరెన్సు ద్వారా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 15,390 ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్లలో క్లోరినైజేషన్ ప్రక్రియను 2 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు.