కృష్ణ

బాబుతో ఆ వెసులుబాటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 31: కాపు రిజర్వేషన్లు, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, కాపు సంక్షేమ పథకాల తీరు, తన ఆరోగ్య పరిస్థితిపై దిగ్దర్శకుడైన దివంగత దాసరి నారాయణరావు ఇటీవల తనను కలిసిన కాపు నేతల వద్ద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపు నాయకులు ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో దాసరి కొన్ని సూచనలు చేశారు. ఆ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి కోట్లతో పథకాలు అమలు చేస్తున్న కాపు కార్పొరేషన్‌ను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కాపులపైనే ఉందని, దాన్ని బలహీనం చేసుకుంటే మనమే నష్టపోతామని చెప్పారు. కాపు ఉద్యమం సమయంలో ఒకవైపు నాయకుల మధ్య సమన్వయం కుదిర్చిన తాను, మరోవైపు కాపు కార్పొరేషన్ నుంచి రుణాలు, విదేశాలకు వెళ్లిన కాపు కుర్రాళ్లతో స్వయంగా మాట్లాడి అవి నిజమా, కాదా? అని ఆరా తీశానని, వారికి ఆ పథకాలతో లబ్ధి చేకూరినట్లు చెప్పారన్నారు. ‘మనకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత కొట్లాటలేవీ లేవు. ఆయన ఇస్తానన్న రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నాం. మంచిచేస్తే మెచ్చుకోవాలి. చెడు చేస్తే అడ్డుకోవాలి. ఇదే మన విధానంగా ఉండాలి. చంద్రబాబు గతంలో తన పార్టీకి మద్దతునిచ్చామన్న గౌరవంతోనో, భయంతోనో, భక్తితోనో కాపుల కోసం చేస్తున్న మంచి పనులు వాడుకోవాలి. అలా వాడుకోకపోవడం మన తప్పే. టిడిపిని, చంద్రబాబును కేవలం బిసి రిజర్వేషన్ల విషయంలో మాత్రమే వ్యతిరేకించాలి తప్ప, పథకాలను వాడుకోకపోవడం సరైంది కాదు. లేకపోతే నిధులు మురిగిపోయి మనవాళ్లే నష్టపోతారు’ అని దాసరి వారికి హితబోధ చేశారు. ‘చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసు. అతను ఎవరితోనూ శత్రుత్వం కోరుకోడు. చెబితే వింటాడు. ఫ్లెక్సిబిలిటీతో వెళతాడు. తన పార్టీకి లాభం వస్తుందంటే ఏం కావాలన్నా చేస్తాడు. మనకిది కావాలని ఒత్తిడి చేస్తే వినే నైజం, వెసులుబాటు, స్వేచ్ఛ బాబు వద్ద ఉంది. నేను చాలామంది పొలిటీషియన్లను చూశా. మిగిలిన పొలిటీషియన్లు అలాకాదు. నేను మొన్నటివరకూ బాబును వ్యతిరేకించా. కొత్త ఫోర్స్ రావాలని కోరుకున్నా. నన్నూ పార్టీలోకి రమ్మని కోరారు. కానీ ఈతరం కుర్రాళ్లు పెద్దోళ్ల సలహాలు తీసుకునే పరిస్థితిలో లేరు. ఢిల్లీలో, ఇక్కడా అలాగే ఉంది. బాబుతో రిజర్వేషన్ల విషయంలో తప్ప మనం ఎక్కడా విభేదించాల్సిన పనిలేదు. చేతుల్లో గవర్నమెంట్ ఉన్నవాళ్లే మనకేమైనా చేయగలరు. మనకు ఇప్పుడుకనుక రిజర్వేషన్లు రాకపోతే ఇక ఎప్పటికీ రావు. దానికోసం పోరాటం చేద్దాం. ఎన్నికల నాటికి బాబు ఏదోఒకటి చేస్తాడనుకుంటున్నా. నేను కేంద్రమంత్రిగా పనిచేస్తున్నప్పుడు చూశా. చాలా పథకాలు వాడుకోకపోవడం వల్ల అవి మురిగిపోయి వెనక్కివెళ్లిన సందర్భాలు చూశా. కాపు కార్పొరేషన్ స్కీంలు చూశా. బాగున్నాయి. ఏ మాటకామాట చెప్పాలి. ఈ స్థాయిలో ఏ గవర్నమెంటూ చేయలేదు. మన పిల్లలు బాగుపడుతుంటే మనకే మంచిదికదా?’ అని కూడా ఆయన నేతల వద్ద వ్యాఖ్యానించారు. ‘క్రియాశీల రాజకీయాలపై ఆసక్తి ఉన్నా మునుపటి మాదిరిగా పనిచేసే పరిస్థితిలో లేను. దేవుడు కరుణించినంత కాలం, ఆరోగ్యం సహకరించినంత కాలం కాపుజాతి కోసం పనిచేస్తాను. ఏ పార్టీలో ఉన్నా కాపులంతా కలిసి ఉండాలి. లేకపోతే బలహీనపడతాం. మనకు బలం ఉండబట్టే అన్ని పార్టీలు గౌరవిస్తున్నాయని గుర్తుంచుకోవాలి’ అని కూడా దాసరి తమకు వివరించినట్లు ఇటీవల ఆయనను కలిసిన నాయకులు వివరించారు.