కృష్ణ

కృష్ణా పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: అమరావతి రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి మహాసంకల్పానికి నిదర్శనంగా ఫ్లైఓవర్ నిర్మాణం నిలుస్తుందని రాబోయే కృష్ణ పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్దా రాఘవరావు, కొల్లు రవీంద్రలు పేర్కొన్నారు. అభివృద్ధి చేసే సమయంలో అధికారుల పనితీరుతో పాటు ప్రజల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని మంత్రులు వెల్లడించారు. స్థానిక మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతం నుండి దుర్గా ఫ్లైఓవర్ పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో మంత్రులు, కలెక్టర్ బాబు ఎతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఈ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 333 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 114 కోట్లతో పనులను చేపడుతున్నామన్నారు. పనుల తీరుపై స్పందిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని పదిశాఖల సమన్వయంతో టీం కృష్ణ చేపడుతున్న పనులను పనిలోని వేగాన్ని మంత్రి అభినందించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పై వంతెన నిర్మాణంతో పాటు ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు పై వంతెన ఆరు వరుసల రహదారి, దిగువ నాలుగు వరుసల రహదారిని చేపడుతున్నామన్నారు. దీనికి అదనంగా దుర్గ గుడి ప్రాంతంలో అంతర్ రహదారి, దుర్గా స్నానఘట్టం పున్నమి ఘాటు వరకు, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం ఫెర్రి వరకు 14 కిలోమీటర్ల మేర అద్భుతమైన స్నానఘట్టాలను నిర్మిస్తున్నామన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న ట్రాఫిక్ సమస్యకు ఈ వంతెన పరిష్కారమన్నారు. రాజధానికి శోభగా నిలబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీరు ప్రతి ఒక్కరికి అవగతమవుతున్నాయని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ డిసెంబర్ 30 నాటికి రామవరప్పాడు అంతర వలయ రహదారి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. దుర్గా పైవంతెన నిర్మాణంలో ట్రాఫిక్ సమస్యను మళ్లించేందుకు రామవరప్పాడు పై వంతెన అంతర వలయ రహదారి పనులు పూర్తి చేయడం ముఖ్యమని అందుకు క్షేత్రస్థాయిలో అన్ని పనులు పూర్తి చేశామన్నారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, స్థానిక నాయకులు బచ్చుల అర్జునుడు, ఆర్ అండ్ బి అధికారి మోషే, అంజినేయుల రెడ్డి, ఆర్డీవో పి సుందర్, దేవస్థానం ఇఇ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

కుళాయికి మోటార్లు బిగిస్తే కనక్షన్ కట్
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 30: విఎంసి సరఫరా చేసే నీటి కుళాయికి విద్యుత్ మోటార్లు బిగిస్తే ఆ కుళాయి కనెక్షన్‌ను కట్ చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 53వ డివిజన్ విజయదుర్గానగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు స్థానిక కార్పొరేటర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావుతోపాటు పలువురు స్థానికులు ఈప్రాంతాల్లో జరుగుతున్న లోపభూయిష్ట నీటి సరఫరాపై పలు వినతులు చేశారు. రోజుక కేవలం గంట మాత్రమే నీటి సరఫరా జరుగుతున్నా పై ప్రాంతాల వారు తమ కుళాయిలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌మోటార్ల వలన నీరు సక్రమంగా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన కమిషనర్ వీరపాండియన్ తక్షణమే మోటార్లు బిగించిన కుళాయి కనెక్షన్లను తొలగించి సక్రమ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తమ ఇళ్లకు ఇంటి పన్ను సౌకర్యం లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తక్షణమే ఇంటి పన్ను సౌకర్యాన్ని కల్పిచాలని, స్థానికంగా ఉన్న రోడ్లను అభివృద్ధి పర్చాలని, స్వచ్చ్భారత్ మరుగుదొడ్ల పథకంలో తమకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని స్థానికులు కోరగా అవసరమైన చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్ సూరజ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబూ శ్రీనివాస్ పాల్గొన్నారు.

విజయవాడ, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశలో భాగంగా రూ.427 కోట్లతో నిర్మించనున్న దుర్గగుడి ఫ్లైఓవర్ పనుల శంకుస్థాపనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తదితర ప్రజాప్రతినిధులు ఈనెల 5న నిర్వహించనున్నట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక కుమ్మరిపాలెం సెంటర్‌లో లారీ స్టాండు ప్రాంతాల్లో శంకుస్థాపనకు, సభా నిర్మాణానికి అనువుగా ఉండే స్థలాన్ని సోమవారం కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ, 2,320 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమయ్యే దుర్గా ఫ్లైఓవర్ పనులను వచ్చే ఏడాది జూలై 15ను కల్లా అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకోవడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవ చూపి దుర్గగుడి ఫ్లైఓవర్ పనులకు సంబంధించిన నిధులను కేంద్రం నుంచి తీసుకురావడం జరిగిందన్నారు. 1850 మీటర్ల ఆరు లైన్ల పై వంతెన హైదరాబాద్ వైపు 220 మీటర్లు, విజయవాడ నగరం వైపు 250 మీటర్ల అప్రోచ్ రోడ్డు పనులను చేపడుతున్నామన్నారు.
పై వంతెన నిర్మాణంలో భాగంగా ఇళ్లు తొలగించిన లబ్ధిదారులకు చెల్లింపులు జరిపామని అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని బాబు.ఎ తెలిపారు. కుమ్మరిపా లెం సెంటర్ నుండి భవానీపురం లారీ స్టాండు వరకు గల ప్రాంతాన్ని శంకుస్థాపన సభావేదిక, శిలాఫలకం ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రదేశాలను గు ర్తించి సిబ్బందికి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సభావేదిక ప్రాంత పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఆర్ అండ్ బి అధికారి మోషే, ఆంజనేయులరెడ్డి, తహశీల్దార్ ఆర్.శివరాం, మధుసూదనరావు, సోమ ప్రాజెక్టు మేనేజర్ సతీష్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.