కృష్ణ

రాష్ట్రంలో 30 మోడల్ పోలీసుస్టేషన్‌ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 12: ఆధునిక, సాంకేతిక పోలీసు వ్యవస్థతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అవనిగడ్డ మోడల్ పోలీసు స్టేషన్‌కు సోమవారం డీజీపీ ఎం మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాలో మోడల్ పోలీసు స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 30 మోడల్ పోలీసు స్టేషన్‌లు నిర్మాణంలో ఉండగా ఇప్పటికే నాలుగు స్టేషన్‌లు ప్రారంభమయ్యాయని తెలిపారు. మోపిదేవిలో పోలీసు స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మోపిదేవిలో ఆర్టీసీ పోలీసు స్టేషన్‌కు స్థలం ఇస్తున్నందుకు చల్లపల్లిలో విజయవాడ రోడ్డులో బస్సు షెల్టర్ ఏర్పాటుకు స్థలం ఇచ్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్‌మీరా, ఎండీ రాజేంద్రనాధ్ రెడ్డి, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.