కృష్ణ

హోదాపై ప్రభుత్వాల విధానాలను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని ఆఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆఖిలపక్ష నాయకులు ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో కలిసి పని చేసినా హోదా సాధించలేకపోయారన్నారు. కేవలం తనపై ఉన్న ఓటుకు నోటు కేసు కారణంగానే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేయలేకపోయారని విమర్శించారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23న పట్టణంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనకు అన్ని రాజకీయ పార్టీల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు రానున్నట్లు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛంగా కొవ్వొత్తుల ప్రదర్శనకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు షేక్ సలార్ దాదా, కొడాలి శర్మ, షేక్ అచ్చాబా, శీలం బాబ్జి, లంకా సూరిబాబు, మోకా భాస్కరరావు, చిటికిన నాగేశ్వరరావు, చౌటపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు, కొల్లాటి శ్రీనివాసరావు, లింగం ఫిలిప్, కరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సొగసు చూడ తరమా!
కనువిందు చేస్తున్న గోడలపై పెయంటింగ్స్
తోట్లవల్లూరు, మార్చి 16: స్వచ్ఛ తోట్లవల్లూరు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సైనికులు ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంట గోడలను రెండు రోజుల నుంచి విజయవాడ సీటీ తరహాలో రంగుల మయం చేస్తున్నారు. తోట్లవల్లూరులో 130 రోజులుగా స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛ సైనికులు గోడలకు సరికొత్త అందాలు తీసుకురావాలని సొంత నిధులను ఖర్చు చేస్తున్నట్టు స్వచ్ఛ తోట్లవల్లూరు వ్యవస్థాపక అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి శుక్రవారం చెప్పారు. మొదటి విడతలో రూ.లక్షతో గోడలకు రంగులు, పూల పెయింటింగ్ వేయిస్తున్నామని చెప్పారు. గ్రామ సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి, స్వచ్ఛ సైనికుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని గురుమూర్తి తెలిపారు.

అలరించిన ఉగాది వైభవం
మహిళా శిరోమణి పురస్కార గ్రహీత మైథిలికి సత్కారం
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 16: స్థానిక బచ్చుపేట మహతి లలిత కళావేదికలో శుక్రవారం ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉగాది వైభవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్ శిరీష గీతాలను, జి రాధిక పద్యాలను, జొన్నలగడ్డ ఝాన్సీ కవితలను హృద్యంగా వినిపించారు. మణికుమార్ బహద్దుర్ ప్రదర్శించిన ఆంజనేయ స్వామి వేషధారణ, నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భారత మహిళా శిరోమణి పురస్కార గ్రహీత కెవి మైథిలిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సాహితీవేత్త డా. బి ధన్వంతరి ఆచార్య, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.