క్రైమ్/లీగల్

పాలకాయతిప్ప సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, మార్చి 16: కోడూరు మండలం పాలకాయతిప్ప సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సైకం వెంకటరాజు గురువారం రాత్రి గల్లంతయ్యాడు. తాను ఉన్న బోట్‌లో ఇంకా ఐదుగురు మత్స్యకారులు ఉండగా శుక్రవారం ఉదయం వెంకటరాజు కనిపించకపోవటంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. నాగాయలంక గుల్లలమోద గ్రామానికి చెందిన జాలర్ల బృందం మూడు రోజుల క్రితం సముద్రంలో వేటకు బయలుదేరి వెళ్లింది. పాలకాయతిప్ప పరిసర సముద్ర ప్రాంతంలో చేపల వేట కోసం వలలు వదిలారు. దీంతో కాపలా ఉన్న వెంకటరాజు తరచూ లైట్ వేసి చూస్తున్నట్లు తెలిపారు. తెల్లవారే సరికి వెంకటరాజు కనిపించకపోవటంతో ఏ విధంగా ప్రమాదానికి గురయ్యాడో తమకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైకం వెంకటరాజుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు మృతదేహం కోసం గాలించినా లభ్యం కాలేదు. కోడూరు, నాగాయలంక పోలీసు స్టేషన్‌లలో మిస్సింగ్ కేసు నమోదు చేసి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు మెరైన్ సిబ్బంది తెలిపారు. ఈలచెట్లదిబ్బ నుండి సముద్రతీరం వెంబడి బందరు వరకు శనివారం కూడా గాలింపు చర్యలు చేపడతామని మిగిలిన సభ్యులు చెబుతున్నారు.