కృష్ణ

నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మార్చి 16: రాష్ట్రంలో నిరుద్యోగ భృతి కి ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. స్థానిక ఆక్స్‌ఫర్డ్ కానె్సప్ట్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లోని నాయకులు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చొరవ చూపాలన్నారు. 30న రెడ్డిగూడెంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో జాబ్‌మేళాలు నిర్వహించి, వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గొల్లపూడి, ఇబ్రహీపట్నంలలో ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు. రాజధానిని సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. సాధికార మిత్రల ద్వారా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నామన్నారు. జాబ్‌మేళాకు 1327మంది హాజరు కాగా 720మందికి ఉద్యోగ అవకాశాలు లభించినట్లు వెల్లడించారు. సీఎం సహాయనిధి కింద 79 మందికి రూ.49,79,660లను అందచేశారు. రైతురథం కింద పజ్జూరు శ్రీనివాసరావుకు సబ్సిడీపై ట్రాక్టరును అందచేశారు. ఇటీవల జి.కొండూరుకు చెందిన టీడీపీ నేత బడుగు రామారావు మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వుయ్యూరు నరసింహారావు, కొల్లి నాగేశ్వరరావు, పజ్జూరు వెంకయ్య, బాదినేని సీతారామరాజు, ఆర్‌ఆర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.