కృష్ణ

దేశ రాజకీయాల్లో ‘టీడీపీ’ది చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 17: దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి చెరగని ముద్ర ఉందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు అన్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను దగా చేసిన కేంద్రంపై తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 200 మంది ఎంపీల మద్దతు లభించిందని శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 మంది ఎంపీల మద్దతు కూడా కూడగట్టలేకపోడం చూస్తే ఆ పార్టీపై ఉన్న నమ్మకం తెలుస్తోందన్నారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనైతికంగా రాష్ట్రాన్ని విభజించి ఏ1 దోషిగా రాష్ట్ర ప్రజల ముందు నిలబడగా నేడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మిత్ర ధర్మాన్ని సైతం ధిక్కరించిన ఎన్డీఎ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఏ2గా ద్వేషిస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి రాష్టప్రతి, ఉపరాష్టప్రతి అభ్యర్థుల ఎంపికలో కూడా కీలక భూమిక పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్లుగా బీజేపీతో కలిసికట్టుగా పనిచేసి విభజన హామీల కోసం శాంతియుత పోరాటం చేస్తే చివరికి కేంద్రం హోదా ఇవ్వకపోగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యతలను తమంతట తాము తీసుకున్నది కాదని, నీతి అయోగ్ చైర్మన్ సూచనల మేరకు కేంద్రం ఆ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించిందన్న విషయాన్ని మరుస్తున్నారని దుయ్యబట్టారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవన్నారు. ఎన్డీఎతో తాము తెగతెంపులు చేసుకున్న క్షణం నుండే బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. టీడీపీని అణగదొక్కేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వమన్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఒక్కడే సమర్థుడని సర్ట్ఫికెట్ ఇచ్చిన జనసేన అధినేత నేడు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి లేనిపోని విమర్శలు చేస్తున్నాడన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని చదివి విమర్శలు చేయడం పవన్‌కల్యాణ్‌కు తగవన్నారు. ఆయన చేసిన విమర్శలకు సాక్ష్యాలు చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా ఈ నాలుగేళ్లల్లో రెండంకెల వృద్ధి సాధించామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం కదిపిన పావుల్లో బలిపశువు కావద్దు
* పవన్‌కల్యాణ్‌పై పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఫైర్
మచిలీపట్నం, మార్చి 17: ప్రత్యేక హోదా కోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడ్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం కదిపిన పావుల్లో పవన్‌కల్యాణ్ బలిపశువు కాబోతున్నాడని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు విమర్శించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చిన ఆయన పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ కేంద్రం నుండి వైదొలిగిన రెండు రోజుల్లో ఏదో జరిగిపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై విమర్శలు చేయడం గర్హనీయమన్నారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు ఆయన అభిమానులే ఆవేదనకు గురవుతున్నారన్నారు. మా పశ్చిమ గోదావరి జిల్లాలోని పవన్ కల్యాణ్ వీరాభిమానులంతా ఆగ్రహావేశంతో ఉన్నారన్నారు. సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు పవన్ కల్యాణ్ అభిమానులు సిద్ధంగా ఉన్నారన్నారు. తనవల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న భ్రమ నుండి పవన్ బయటకు రావాలన్నారు. తమ నేతపై విమర్శలు చేస్తున్న పవన్‌కల్యాణ్, జగన్మోహనరెడ్డి గడిచిన ఏడాదిన్నర కాలంలో కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి తెచ్చారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.