కృష్ణ

దంపతుల హత్య కేసులో విభిన్న కోణాల్లో దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మార్చి 17: గుడివాడ రాజేంద్రనగర్‌లో జరిగిన బొప్పన సాయిచౌదరి - నాగమణి దంపతుల హత్య కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. శనివారం హత్య జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేఖర్లతో మాట్లాడుతూ ఈ హత్యలు ఎలా జరిగాయనే కోణంలో విస్తృత దర్యాప్తు సాగుతోందని, పోలీసు బృందాలు దుండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయన్నారు. ఫలానా కారణంతో హత్యలు జరిగాయని ఇప్పుడే చెప్పలేమన్నారు. హత్యలపై అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెల్లడిస్తామని ఎస్పీ త్రిపాఠి చెప్పారు. ఈ సమావేశంలో గుడివాడ డీఎస్పీ పీ మహేష్, వన్‌టౌన్ సీఐ డీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

పోలీసులకు పెను సవాల్‌గా మారిన జంట హత్యల కేసు
ఇంకా లభించని దుండగులు ఎత్తుకెళ్ళిన కారు ఆచూకీ
దర్యాప్తు వేగవంతానికి ఐదు బృందాల ఏర్పాటు
గుడివాడ, మార్చి 17: గుడివాడ రాజేంద్రనగర్ 4వ లైన్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. దుండగుల చేతిలో ప్రముఖ రైస్‌మిల్లర్ బొప్పన సాయిచౌదరి (72), ఆయన భార్య నాగమణి (67) దారుణ హత్యకు గురికావడం పట్టణంలో సంచలనం రేపింది. ఈ హత్యలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణంలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో దంపతులిద్దరినీ విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హతమార్చడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. సాయిచౌదరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె పిన్నమనేని సుధ స్థానిక ఆర్‌కే రెసిడెన్సీలో ఉంటుండగా మరో కుమార్తె పొట్లూరి సురేఖ విజయవాడ భారతీనగర్‌లో నివాసముంటున్నారు. కుమారుడు బొప్పన రమేష్ హైదరాబాద్‌లోని హిందూ ప్రాజెక్ట్స్‌లో ఉంటున్నారు. గుడివాడ పామర్రు రోడ్డులోని రాజ్యలక్ష్మి రైస్‌మిల్ పార్టనర్‌గా, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యుడిగా సాయిచౌదరి వ్యవహరిస్తున్నారు. గతంలో కమ్మవారి సత్రం చైర్మన్‌గా, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ 4వ లైన్‌లోని టౌన్ హైస్కూల్ సమీపంలో ఉంటున్న సాయిచౌదరి ఇంట్లోకి దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి పోర్టికో పైన ఉన్న బాల్కనీలో నుండి దుండగులు ఇంట్లోకి సులభంగా చేరుకున్నట్టు కన్పిస్తోంది. సాయిచౌదరి గుండె, నడుము ప్రాంతాల్లో, నాగమణి పొట్ట, నడుము భాగాల్లో కత్తిగాట్లు కన్పిస్తున్నాయి. మృతదేహాలను హాలులో నుండి బెడ్‌రూంలోకి ఈడ్చుకెళ్ళినట్టు రక్తపు చారలను బట్టి తెలుస్తోంది. సాయిచౌదరి ఒంటిపై ఎటువంటి దుస్తులూ లేవు. దుండగులు దుస్తులను తొలగించి వికృత చేష్ఠలతో హింసించి హత్య చేశారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. నాగమణి మెడలో బంగారు నల్లపూసల తాడు, నానుతాడు తప్ప ఇంట్లోని విలువైన వస్తువులను దుండగులు ఎత్తుకెళ్ళకపోవడాన్ని బట్టి డబ్బు కోసం ఈ హత్యలు చేయలేదనే పోలీసులు నిర్ధారిస్తున్నారు. దుండగులు వెళ్ళిపోయేటపుడు సాయిచౌదరి ఇంట్లో ఉన్న టయోటా ఇటియాస్ కారును తీసుకెళ్ళడాన్ని బట్టి వారు వచ్చేటపుడు నడిచి వచ్చారా, లేక ఆటోలో గాని, మరేదైనా వాహనంపై గాని వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూసే వరకు ఈ వ్యవహారం బయటకు తెలియలేదు. పనిమనిషి ద్వారా విషయం తెలుసుకున్న సాయిచౌదరి బంధువులు ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా దంపతులిద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ పి. మహేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయిచౌదరి ఇంటిని క్లూస్ టీం అణువణువునా గాలించింది. దర్యాప్తును వేగవంతం చేసేందుకు వచ్చిన పోలీసు జాగిలం హత్య జరిగిన ప్రాంతం నుండి టీటీడీ కళ్యాణ మండపం, ఆర్టీవో కార్యాలయం, రాజేంద్రనగర్ మెయిన్ రోడ్డు మీదుగా ఏలూర్ రోడ్డులోని బాపినీడు పెట్రోల్ బంక్ వరకు వెళ్ళింది. శనివారం తెల్లవారుజాము 4.30 గంటల ప్రాంతంలో దుండగులు ఎత్తుకెళ్ళిన టయోటా ఇటియాస్ కారును చూసినట్టు పలువురు చెప్పడంతో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వీడియో పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతుడు సాయిచౌదరికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, ఈ హత్యలో తెలిసిన వాళ్ళుగాని, పనివాళ్ళు గాని, డ్రైవర్ల ప్రమేయం గాని ఉందా, లేక మరేదైనా కారణం కావచ్చా అనే కోణాల్లో పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని గుడివాడ డీఎస్పీ పీ మహేష్‌కు సూచనలిచ్చారు. సాయిచౌదరి ఇంటికి పెద్దఎత్తున బంధువులు చేరుకున్నారు. పట్టణ ప్రముఖులు సాయిచౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.