కృష్ణ

కర్షకుల అభ్యున్నతికే కర్షకమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మార్చి 20: కర్షకమిత్ర పథకం ద్వారా రైతుల కుటుంబాలలో వివాహాలకు, విదేశాలలో విద్యను అభ్యసించేందుకు కేడీసీసీ బ్యాంక్ రూ.10లక్షల రుణం అందజేస్తుందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మొవ్వ, ఘంటసాల మండలాల పీఏసీఎస్ సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శుల సమీక్ష సమావేశాన్ని మొవ్వ కెడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిన్నమనేని మాట్లాడుతూ కార్పొరేట్ బ్యాంకుల్లో రికవరీ తక్కువగా ఉన్నా కెడీసీసీ బ్యాంక్ పరిధిలోని సొసైటీలు ఉత్తమ స్థాయిలో రికవరీ చేస్తున్నాయన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలలో రాష్ట్రం 3వ స్థానంలో ఉండగా కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.4,300 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు పిన్నమనేని తెలిపారు. సంఘాల ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి కార్యదర్శులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. 162 సొసైటీలలో 60 సొసైటీలు ఇన్ బ్యాలెన్స్‌లో ఉన్నాయన్నారు. గత ఐదు సంవత్సరాలలో ఎల్‌టీ లోన్లు పెంచి రూ.540కోట్లకు చేరినట్లు తెలిపారు. రైతుల అభివృద్ధే ధ్యేయంగా తమ బ్యాంక్ నాబార్డు విధించిన వడ్డీ రేట్లలో కెడీసీసీ బ్యాంక్ ఆరు శాతాన్ని రైతులకు చెల్లిస్తుందన్నారు. ఓటీఎస్ పథకం ద్వారా చేపల చెరువుల పెంపకానికి కెడీసీసీ బ్యాంక్ రుణాలు అందజేస్తుందన్నారు. ఇప్పటి వరకు రూ.1.5కోట్ల మొండి బకాయిలు వసూలు చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కెడీసీసీ బ్యాంక్ పని చేయటంతో తమ ఆశయం నెరవేరుతోందని పిన్నమనేని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కెడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కాకర్ల శివకుమార్ (చిట్టిబాబు), సీఇఓ సుబ్రహ్మణ్యం, జిఎం చంద్రశేఖర్, బ్రాంచ్ మేనేజర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యను అధిగమించాలి
కూచిపూడి, మార్చి 20: వేసవిలో మంచినీటి సమస్య అధిగమింపజేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీ తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ కిలారపు మంగమ్మ సూచించారు. మంచినీటి ఎద్దడి ఏర్పడితే ఒక వ్యక్తికి 15 లీటర్ల వంతున అవసరమైతే ట్యాంకులు ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేసిందని ఎంపీపీ పేర్కొన్నారు. మంచినీటి సమస్యపై మంగళవారం మొవ్వ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యుఎస్, ఉపాధి హామీ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు మంచినీటి చెరువులతో పాటు పశువుల చెరువులు, పంచాయతీ చేపల చెరువులు నింపేందుకు కృష్ణా జలాలను విడుదల చేసిందన్నారు. ఈ నీటితో అవసరమైతే మోటార్లు ద్వారా చెరువులు నింపాలన్నారు. తిరిగి మే నెలలో 2వ విడత మంచినీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ సీహెచ్ సుబ్బారావు పేర్కొన్నారు. మండలంలో 30కి పైగా చెరువులు ఉండగా వీటిలో కాజ, పద్దారాయుడుతోట, మాకులవారిపాలెం, అవిరిపూడి గ్రామాలలోని మంచినీటి చెరువులు తప్పని సరిగా కార్యదర్శులు నింపాలన్నారు. 15 చెరువులను ఉపాధి హామీ పథకం కింద పూడికతీత చేపట్టి గట్లు పటిష్టం చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీడీ లక్ష్మీరెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో నీటి కుంటలు తవ్వేందుకు రైతులను ప్రోత్సహించాలని కార్యదర్శులకు సూచించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.58వేలతో ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా న్యూట్రీ గార్డెన్స్‌ను అంగన్‌వాడి కేంద్రాల పరిధిలో నిర్మించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.