కృష్ణ

తీవ్రమవుతున్న హోదా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 21: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్షాలు తలపెట్టిన ఉద్యమం రోజు రోజుకీ తీవ్రతమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ప్రత్యేక హోదాపై తాడో పేడో తేల్చుకుంటామని రంగంలోకి దిగిన అధికార తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సాక్షిగా పోరాటం సాగిస్తుండగా ప్రతిపక్ష పార్టీలు బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు తదితర రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ను నిర్వహించిన ప్రతిపక్షాలు నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రహదార్ల దిగ్బంధ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గత నాలుగైదు రోజుల నుండి వ్యూహ రచనలు పన్నుతున్నారు. ఇప్పటికే పలు మార్లు జిల్లా అంతటా ఆఖిలపక్షం పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన ప్రతిపక్ష నేతలు ప్రత్యేక హోదాపై పోరును మరింత హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న పరిణామాలపై ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పక్షంతో జతగా ఉన్న జనసేన కూడా నేడు జరిగే రహదార్ల దిగ్బంధంలో పాలు పంచుకోనుంది. దీంతో ఉద్యమ తీవ్రత మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షాలు తలపెట్టిన రహదార్ల దిగ్బంధంకు మద్దతు ఇవ్వటం ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది. రహదార్ల దిగ్బంధంపై బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా రహదార్ల దిగ్బంధంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నేడు రోడ్ల మీదకు రానున్నారు. ఇదిలా ఉండగా జాతీయ రహదార్ల దిగ్బంధంపై పోలీసులు సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం రాష్టమ్రంతటా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ రహదార్లను దిగ్బంధం చేయడం వల్ల పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ
జాతీయ రహదార్ల నిర్బంధం పేరుతో విద్యార్థులకు, ప్రజలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ఆందోళన చేయాలన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో రహదార్లను దిగ్బంధించడం వల్ల వారు అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. రహదార్ల దిగ్బంధం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ దృష్టి సారించినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

‘్ధన్యం’ సేకరణలో ఆల్ టైమ్ రికార్డ్
* రైతులకు నూరు శాతం చెల్లింపులు * కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
మచిలీపట్నం, మార్చి 21: ఖరీఫ్ ధాన్యం సేకరణలో కృష్ణాజిల్లా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని కలెక్టర్ లక్ష్మీకాంతం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్‌లో 8.12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డ్ సృష్టించామన్నారు. గత ఖరీఫ్‌లో కేవలం 7.67లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించామన్నారు. ఈ ఏడాది అదనంగా 45వేల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు. సేకరించిన ధాన్యానికి నూరు శాతం చెల్లింపులు జరిగాయన్నారు. మొత్తం రూ.1290 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1274కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేశామన్నారు. మిగిలిన రూ.16కోట్లు కూడా రెండు మూడు రోజుల్లో చెల్లిస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల గాను జిల్లా అంతటా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ధాన్యం సేకరించాలన్న లక్ష్యంతో నేరుగా కొనుగోలు కేంద్రం అధికారులే రైతుల వద్దకు వెళ్లి కల్లాల మీద కొనుగోళ్లు చేశారని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు
అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్
మైలవరం, మార్చి 21: మైలవరంలో అర్హత కలిగిన వారందరికీ ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ళ స్థలాల పంపిణీపై బుధవారం స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మంటపంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా మైలవరంలో ఇళ్ళ స్థలాల పంపిణీ జరగలేదని, ఎందరో పేదలు ఇళ్ళ స్థలాలకై ఇప్పటికే పలుమార్లు అర్జీలను సమర్పించటం జరిగిందన్నారు. 388 జీఓ ప్రకారం ఇప్పటికే కొందరు పేదలకు ఇళ్ళ స్థలాలను రెగ్యులర్ చేయగా ఇంకా అనేక వందల మంది ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. తాజాగా పంపిణీ చేయబోతున్న ఇళ్ళ స్థలాలు అర్హులకు కాకుండా అనర్హులకు పంపిణీ చేస్తే సహించేది లేదన్నారు. కొందరు తెలుగు తమ్ముళ్ళు అధికారులను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలురైన వారికి ఇప్పించుకునే ప్రయత్నాలను తాము సహించేది లేదన్నారు. పార్టీలు, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అర్హత కలిగిన పేదలందరికీ నివేశన స్థలాల పంపిణీ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో పేదలతో ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. అనంతరం నేతలంతా తహశీల్దార్ కెవి శివయ్యను కలిసి ఇళ్ళ స్థలాలకు లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పట్టాల పంపిణీ ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇందుకు ఆయన స్పందిస్తూ కొద్ది మందికి ఈజాబితాలో చోటు దక్కనంత మాత్రాన మొత్తం పంపిణీ ఆపమని కోరటం సమంజసం కాదన్నారు. దీని వల్ల లబ్దిపొందే ఎక్కువ మంది నిరుత్సాహానికి గురవుతారన్నారు. ఈ జాబితాలో చోటు దక్కని వారికి మళ్ళీ భూమి కొనుగోలు చేసి రెండో జాబితాలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో ఏదైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేస్తే సరి చేసి అర్హులకు అవకాశం కల్పిస్తామని తహశీల్దార్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పీవీ ఆంజనేయులు, మైలవరం మండల కార్యదర్శి రావూరి రామారావు, పట్టణ కార్యదర్శి ఎండి జాని, సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ బుడ్డి రమేష్, తెలుగుదేశం నుండి కెఎస్‌ఎస్ ప్రసాద్, వైసీపీ నుండి షేక్ అబ్దుల్ కరీమ్, బీజేపీ నుండి వజ్రాల వెంకట కృష్ణారెడ్డి, పి వెంకటేశ్వరరావు, సీపీఎంఎల్ న్యూ డెమొక్రసీ నేత రామకృష్ణ, పలు ప్రజా సంఘాల నేతలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.