కృష్ణ

కాగిత రహిత లావాదేవీలపై రేపటి నుండి డీడీఓలకు ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కల్చరల్), మార్చి 21: రానున్న ఆర్థిక సంవత్సరం నుండి సమీకృత ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా కాగిత రహిత ఆర్థిక లావాదేవీల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నూతన విధానంపై డీడీఓలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఖజానా అధికారి వి నాగ మహేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి 29వతేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో 23వతేదీ ఉదయం 10గంటలకు అవనిగడ్డ, మొవ్వ సబ్ ట్రజరీ కార్యాలయ పరిధిలోని డీడీఓలకు, 24న బందరు, బంటుమిల్లి సబ్ ట్రజరీ కార్యాలయాల పరిధిలోని డీడీఓలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే విజయవాడ కెబిఎన్ కళాశాలలో 23వ తేదీ ఉదయం 10గంటలకు విజయవాడ వెస్ట్ సబ్ ట్రజరీ కార్యాలయ పరిధిలోని డీడీఓలకు రెండు బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తామన్నారు. 24వ తేదీన కంచికచర్లలోని డా.పివి రావు కల్యాణ మండపంలో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, మైలవరం సబ్ ట్రజరీ కార్యాలయాల పరిధిలోని డీడీఓలకు, 27న నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో నూజివీడు, గన్నవరం, విస్సన్నపేట, తిరువూరు సబ్ ట్రజరీ కార్యాలయాల పరిధిలోని డీడీఓలకు, 29న గుడివాడ ఎఎన్‌ఆర్ కళాశాలలో గుడివాడ, కైకలూరు, పమర్రు, ఉయ్యూరు సబ్ ట్రజరీ కార్యాలయాల పరిధిలోని డీడీఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

దళిుడిని చితకబాదిన కానిస్టేబుల్
కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
కూచిపూడి, మార్చి 21: అనుమానితుడి పేరుతో దళితుడిని తీవ్రంగా కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని మొవ్వ మండల దళితులు మంగళవారం అర్ధరాత్రి కూచిపూడి పోలీసు స్టేషన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు తరలివచ్చి దళిత నాయకులతో చర్చలు జరిపి కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో అర్ధరాత్రి 2గంటలకు దళితులు ఆందోళన విరమించారు. కూచిపూడి ఎస్‌ఐ పెద్దిరెడ్డి సమాచారం మేరకు మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన నార్ని క్రాంతి కుమార్‌కు చెందిన కుక్కపిల్ల ఈ నెల 19వ తేదీన కనిపించకుండా పోయింది. ఆ గ్రామానికి చెందిన అయ్యంకి సువర్ణరాజుపై క్రాంతికుమార్ అనుమానం వ్యక్తం చేశాడు. అదే రోజు రాత్రి సువర్ణరాజును కానిస్టేబుల్ శ్రీనివాసరావు స్టేషన్‌కు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ చేపట్టటంతో అనుమానితుడు గాయాలపాలయ్యాడు. వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర బాధితుడిని పామర్రులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సువర్ణరాజును భార్య, తల్లి కూచిపూడి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంఆర్‌పీఎస్ నాయకులు హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సీఐ జనార్ధనరావు కూచిపూడి పోలీసు స్టేషన్‌కు తరలి వచ్చి దళితులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని అవనిగడ్డ డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్‌పై కేసులు పెట్టి అరెస్టు చేయకపోతే తిరిగి ఆందోళన చేస్తామని దళితులు హెచ్చరించారు.