కృష్ణ

నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మార్చి 22: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 31వ తేదీలోగా ఇంటి పన్నులు, కుళాయి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని డీఎల్‌పీఓ జె సత్యనారాయణ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బందరు డివిజన్‌లో అవనిగడ్డ, పెడన, మొవ్వ మండలాలు శిస్తు వసూళ్లలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ఘంటసాల, బందరు మండలాలు ఆఖరి స్థానంలో ఉన్నాయన్నారు. బందరు డివిజన్‌లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.9కోట్ల 6లక్షల ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఆన్‌లైన్‌లో నమోదు కావటం ఆలస్యం కావటంతో ఇప్పటి వరకు రూ.2కోట్ల 40లక్షలు మాత్రమే వసూలయ్యాయన్నారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డా. ఎం శ్రీనివాసరావు, తహశీల్దార్ బి రామానాయక్, ఎంపీడీఓ వి ఆనందరావు, సర్పంచ్ కందుల జయరాం, ఇఓ గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.