క్రైమ్/లీగల్

దుప్పి మాంసం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, ఏప్రిల్ 3: దుప్పిని వధించి మాంసాన్ని విక్రయించే వ్యక్తిపై అటవీ శాఖాధికారులు కేసు నమోదు చేశారు. జి.కొండూరు ఎస్‌ఐ రాజేష్ ప్రత్యేక నిఘా ఉంచి దుప్పిని వేటాడిన వ్యక్తిని రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. దీంతో అటవీ శాఖాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనే విషయం మరోసారి తేటతెల్లమైంది. వివరాల్లోనికి వెళితే జి.కొండూరుకు చెందిన వుయ్యూరు గోపాలస్వామి అనే వ్యక్తి గెయిల్ సంస్థకు సమీపంలో దుప్పి చర్మం వలిచి మాంసం విక్రయిస్తుండగా జి.కొండూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం అటవీ శాఖ పరిధిలోనిది కావడంతో సదరు వ్యక్తిని, దుప్పి మాంసాన్ని, అవశేషాలను మైలవరం అటవీ శాఖాధికారులకు అప్పగించారు. ఇదంతా సోమవారమే జరిగింది. కానీ అటవీ శాఖాధికారులు మాత్రం తాపీగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మంగళవారం కేసు నమోదు చేశారు. దుప్పికి పంచనామా నిర్వహించారు. నిందితుడు గోపాలస్వామిని అదుపులోనికి తీసుకున్నారు. మైలవరం కోర్టులో హాజరు పర్చగా గోపాలస్వామికి రిమాండ్ విధించినట్లు అటవీ శాఖాధికారి ఫిరోజ్ తెలిపారు.

ఇళ్లలోకి దూసుకెళ్లిన లారీ
మైలవరం, ఏప్రిల్ 3: అదుపు తప్పి ఒక లారీ ఇళ్ళలోకి దూసుకెళ్ళిన సంఘటన స్థానిక చంద్రబాబునగర్‌లో మంగళవారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం మైలవరం వైపు నుండి నూజివీడు వైపునకు వెళ్తున్న సిమెంటు లోడు లారీ చంద్రబాబునగర్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న బడ్డీ కొట్టును ఢీకొని అంతటితో ఆగకుండా ఇళ్ళపైకి వెళ్ళింది. ఈ ప్రమాదంలో బడ్డీకొట్లు రెండు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అదేవిధంగా రెండు ఇళ్ళు కూడా పడిపోయాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.