కృష్ణ

డ్రాఫ్ట్ బడ్జెట్‌పై స్టాండింగ్ కమిటీ సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన విఎంసి డ్రాఫ్ బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ సమావేశం కొన్ని అంశాలపై సవరణకు ప్రతిపాదించింది. బుధవారం సాయంత్రం కౌన్సిల్ హాల్లోని స్టాండింగ్ కమిటీ హాల్లో కమిటీ చైర్మన్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు పాల్గొని బడ్జెట్ అంచనాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అధికారులు తయారుచేసిన డ్రాఫ్ట్ బడ్జెట్‌పై సంతృప్తి చెందక కొన్ని సవరణలకు ప్రతిపాదనలు చేసారు. రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నగర సమగ్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, అందుకవసరమైన నిధుల సమీకరణ తోపాటు గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనుల అంచనాలను ప్రస్తుత బడ్జెట్‌కు ప్రతిపాదించడమే కాకుండా రాజధాని నేపథ్యంలో చేపట్టాల్సిన వివిధ వౌలిక వసతులు, సౌకర్యాల కల్పనలపై కూడా చర్చలు జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, వచ్చిన నిధులు వాటి వ్యయం, ఆర్థిక సంఘం నిధులు, వృత్తి పన్ను, ప్రకటనల పన్ను, డి అండ్ ఓ లైసెన్స్ ఫీజులు, వేకెంట్‌ల్యాండ్ టాక్స్ వసూలు పెంపు తదితర అంశాలపై బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై సభ్యులు పలు సూచనలు చేశారు. అన్నింటినీ పరిశీలించి మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు చర్యలు తీసుకొంటామని అధికారులు పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం అనంతరం సాధారణ కౌన్సిల్ కూడా బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉంది. కౌన్సిల్ ఆమోదించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను పరిశీలిస్తే 2015-16 లో సవరించిన అంచనాల బడ్జెట్ 972 కోట్ల 61లక్షలు కాగా ప్రస్తుతం 2016-17 డ్రాఫ్ట్ బడ్జెట్ 1603 కోట్ల 13లక్షల రూపాయల వరకూ ఉండే అవకాశముంది. ఇందులో రెవెన్యూ ఆదాయం 482 కోట్లకు పైగా ఉంటుంది. కాపిటల్ ఆదాయం రూ.1079 కోట్లు, డిపాజిట్లు మరియు అడ్వాన్స్‌ల రూపంలో 49,08,13,000 లు మొత్తం కలిసి 1627 కోట్ల 26 లక్షలుగా ఉంది. అలాగే ఖర్చు ను పరిశీలిస్తే రెవెన్యూ ఖర్చు 365 కోట్ల 70 లక్షలు, కాపిటల్ ఖర్చు 1139 కోట్ల 80 లక్షలు, లోన్ రీపేమెంట్ 48 కోట్లు, డిపాజిట్లు మరియు అడ్వాన్స్‌లు 50 కోట్లుగా ఉంది. 2014-15 వార్షిక బడ్జెట్ రూ.334,55,33,907 లు కాగా 2015-16 వార్షిక బడ్జెట్‌ను 756 కోట్లకు చేరుకొంది. దీనిని ప్రస్తుత వార్షిక బడ్జెట్‌ను 16వందల కోట్లకు చేరుకోవడం విశేషం. డ్రాఫ్ట్ బడ్జెట్ ను పరిశీలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విఎంసికి దండిగా ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల రాబడి ఏ విధంగా ఉటుందో అంచనా వేయవచ్చు.

నాటుసారా రహిత జిల్లాగా కృష్ణా

విజయవాడ, ఫిబ్రవరి 3:నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే నవోదయం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ బాబు ఎ పేర్కొన్నారు. నాటుసారా తయారీ, నిల్వచేయడం, సరఫరాను అరికట్టి పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాబు ఎ బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోడపత్రికలు, కరపత్రాలను విడుదల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటుసారా తాగడం వలన అనారోగ్యం పాడవడమే కాకుండా సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం పేదలకు ఆర్థిక సహాయంగా అందిస్తున్న యన్‌టిఆర్ భరోసా ఫించను సొమ్మును పలువులు నాటుసారా తాగడానికి ఉపయోగించి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల పాల్జేస్తున్నారన్నారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా తన దత్తత గ్రామమైన గంపలగూడెం మండలం ఉమ్మడి దేవరపల్లిలో ఒక మహిళ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పిందన్నారు. మహిళలు ఇచ్చిన సమాచారంతో ఉమ్మడిదేవరపల్లిలో ఆరు వేల లీటర్లు నాటు సారా తయారీని ఖమ్మం జిల్లా కలెక్టర్ అరికట్టగలిగారన్నారు. నాటుసారా నిర్మూలన ఎక్సైజ్ శాఖ ఒక్కరిదే బాధ్యత కాదని, అన్ని శాఖలు ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, ఫారెస్టు శాఖల సమన్వయంతో పనిచేసినపుడే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. సారా తయారు చేసేవారిని గుర్తించి వారికి కౌనె్సలింగ్ నిర్వహించి సంక్షేమ పథకాలలో రుణాలు ఇప్పించి తిరిగి వారు సారా తయారీ చేపట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలలో నాటుసారా, చీప్ లిక్కరు అందుబాటులో లేకుండా చేయాలని నల్లబెల్లం అమ్మకందారులను గుర్తించి కేసులను నమోదు చేయాలన్నారు. ఎవరి సిఫార్సులను ఖాతరు చేయరాదని తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన సంఘటనను కలెక్టర్ ప్రస్తావించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సిహెచ్ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం కట్టుదిట్టంగా అమలు జరగాలంటే పోలీసు, రెవెన్యూ శాఖల పూర్తి సహకారం అవసరం అన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం ఎబిసి కేటగిరీలుగా గుర్తించిన గ్రామాలను మరొకసారి పరిశీలించి మిగిలిన గ్రామాలను కలపడం జరుగుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ నాటుసారా తయారీకి అవసరమైన ముడిసరుకుల రవాణాను అరికట్టాలన్నారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ భాస్కరరావు మాట్లాడుతూ జిల్లాలో 12 మంది నల్లబెల్లం వ్యాపారులు ఉన్నారని, వీరిపై చర్యలు తీసుకుంటే నాటుసారా తయారీకి అవసరమైన నల్లబెల్లం సరఫరా ఆగిపోతుందన్నారు.
సమావేశంలో అడిషనల్ ఎస్‌పి, యన్‌విఎస్ సాగర్ బాబు, విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు డా.జి.సృజన, డా.జి.లక్ష్మీషా, బందరు , గుడివాడ ఆర్డీఓలు సాయిబాబు, చక్రపాణి, గన్నవరం తహశీల్దారు మాధురి, నూజివీడు, బందరు డిఎస్పీలు ప్రసంగించారు. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సిఐలు, ఎస్‌ఐలు, ఫారెస్టు సిబ్బంది, మండల తహశీల్దార్లు, డిఎస్‌పిలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

మరో వారం రోజులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రద్దు?

విజయవాడ (రైల్వే స్టేషన్), ఫిబ్రవరి 3: విజయవాడ - విశాఖపట్నం - విజయవాడ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు ఎక్కడానికి మరో వారం రోజులు పట్టే విధంగా ఉంది. అయితే అధికారులు మాత్రం మరో రెండు మూడు రోజుల వ్యవధిలో పట్టాలు ఎక్కుతుందని వెల్లడిస్తున్నారు. విజయవాడ డివిజన్ అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె వేణుగోపాలరావు ఈ విలేఖరితో మాట్లాడుతూ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ నడపడానికి 24 బోగీలు అవసరమన్నారు. తుని ప్రాంతంలో కాపు మహాగర్జన సంఘటనలో 24 బోగీలు తగలబడిపోయిన సంగతి తెలిసిందేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే విశాఖపట్నం - విజయవాడ - విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఒకటే ఇటు నుంచి వెల్లి అటు నుంచి తిరిగి వస్తుందన్నారు. ప్రస్తుతం మొత్తం 24 బోగీలున్న ఈ రైలు కాలిపోవడం కారణంగా ప్రస్తుతం ఈ రైలును తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. ప్రస్తుతం నాలుగు బోగీలను సిద్ధం చేయడం జరిగిందని, మిగిలిన 23 బోగీల్లో ఒక ప్యాంటరీ కారు బోగి అవసరమని వీటన్నింటినీ కూడా మరో రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాని మొత్తం మీద మరో నాలుగు రోజులైనా పట్టవచ్చని మరో సమాధానంగా వెల్లడించారు. ఏదిఏమైనా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కడానికి మరో వారం రోజులు తప్పదని అధికారపూర్వకంగా వెల్లడవుతోంది.
తలనీలాల వేలంలో రికార్డు స్థాయ ఆదాయం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మకను భక్తులు మొక్కుబడుల నిమిత్తం సమర్పించిన తలనీలాలలను రెండు సంవత్సరాలుపాటు ప్రోగు చేసుకోవటానికి బహిరంగవేలంపాట నిర్వహించగా 12 కోట్ల 19 లక్షల 30 పాట దారునికి ఖరారు అయింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి భవానీదీక్ష మండపంలో బుధవారం మధ్యాహ్నం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవోసిహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం సిబ్బంది తలనీలాలు ప్రోగు చేసుకోనేందుకు బహిరంగవేలంపాట నిర్వహించగా రెండు సంస్ధలకు చెందిన వారు మాత్రమే పాల్గొన్నారు. ఈబహిరంగవేలంపాటలో ఏలూరు చెందిన శ్రీనివాస హెయిర్ ఇండస్ట్రీస్ సంస్ధకు చెందిన వారు ఈహెచ్చుమొత్తానికి వేలంపాట పాడారు. ఈబహిరంగవేలంపాటలో కేవలం రెండు సంస్ధలకు చెందిన వారే దేవస్థానం సూచించిన డిపాజిట్‌ను చెల్లించి ఈవేలంపాటలో పాల్గొన్నారు. ఈవిషయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వైవి అనూరాధ దృష్టికి తీసుకువెళ్ళి ఆమె అనుమతి ఇచ్చిన తర్వాతనే పాట దారునికి ఈలీజు హక్కును ఖరారు చేయటం జరుగుతోందని దుర్గగుడి ఇవోసిహెచ్ నరసింగరావు తెలిపారు. గత సంవత్సరం కంటె ఈసంవత్సరానికి సుమారు 50వేల మేరకు అదనంగా పాట పెరిగింది. ఈకార్యక్రమంలో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం సహాయ ఇవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు,బి వెంకటరెడ్డి, డి సాయిబాబానాయుడు, పర్యవేక్షాధికారులు కె చంద్రశేఖర్, అమృతరావు,గోపిచంద్, వివిధ సెక్షన్‌లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జి సిపిగా సురేంద్రబాబు బాధ్యతలు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 3: నగర ఇన్‌ఛార్జి పోలీసు కమిషనర్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి ఎన్‌వి సురేంద్రబాబు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ బుధవారం నుంచి ఈ నెల 15 వరకు సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. అదనపు డిజిపి, గతంలో డిఐజి హోదాలో నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం కలిగిన ఎన్‌వి సురేంద్రబాబును ఇన్‌చార్జిగా నియమించింది. ఘ