క్రైమ్/లీగల్

ప్రయాణికురాలి బ్యాగ్‌తో ఉడాయించిన ఆటోడ్రైవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 20: బస్టాండుకు వెళ్లేందుకు ఎక్కిన ప్రయాణికురాలి బ్యాగ్‌తో ఓ ఆటోడ్రైవర్ ఉడాయించాడు. కొన్ని గంటలలోనే పోలీసులు సీసీ కెమేరా ఫుటేజీ ద్వారా నిందితుని గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.60 వేలు విలువ చేసే 30 గ్రాముల బంగారం, రెండు చీరెలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఎనిగళ్ల శ్రీవల్లి (50) గురువారం విజయవాడలోని బంధువుల వివాహం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కార్యక్రమాలకు హాజరైన పిదప రాత్రి పటమటలోని బంధువుల ఇంటిలో బసచేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం ఉదయం బెంజి సర్కిల్ సమీపంలో బస్టాండుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో ఆటో దిగిన వెంటనే డ్రైవర్ కిరాయి డబ్బులు కూడా తీసుకోకుండా హడావుడిగా జారుకున్నాడు. ఆటో వెనుక సీట్‌లో ఆమె లగేజ్ బ్యాగ్ ఉండటంతో గట్టిగా కేకలు వేసినా ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు గవర్నర్ పేట పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు ఆటో ప్రయాణించిన మార్గంలోనే సీసీ కేమేరా ఫుటేజీలను పరిశీలించి ఎట్టకేలకు ఆటోడ్రైవర్ ఆచూకీ కనుగొన్నారు. పెనమలూరుకు చెందిన దుర్గారావు అనే ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా అప్పటికే ఇంట్లో దాచిన ప్రయాణికురాలి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్‌లో 30 గ్రాముల బంగారు నగలు, రెండు ఖరీదైన చీరెలు స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేశారు.