కృష్ణ

రైతుల భూములు కాజేసేందుకే ‘మడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: లక్షలాది ఎకరాల రైతుల భూములు లాక్కోడానికి ప్రభుత్వం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) పేరుతో మరో ఎత్తుగడ వేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరోపించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నాని మాట్లాడుతూ పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో 33వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఈప్రాంతంలో మరికొన్ని వేల ఎకరాల భూములు చేజిక్కించుకునేందుకు ‘మడ’ ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. ‘మడ’ వల్ల ఈప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందదన్నారు. ప్రత్యేక నిధుల కేటాయింపు కూడా ఉండదని స్పష్టం చేశారు. కేవలం రైతుల భూములపై ఆజమాయిషీ కోసమే ‘మడ’ ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఎత్తుగడను తిప్పికొట్టేందుకు భూపరిరక్షణ కమిటీ పేరుతో పెద్దఎత్తున ఉద్యమించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం కార్పొరేషన్ విషయంలో ఎన్నో అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయన్నారు. చట్టప్రకారం పాలకవర్గం కొనసాగే పరిస్థితి లేదన్నారు. మున్సిపాల్టీని కార్పొరేషన్ చేయాలని పాలకవర్గం కౌన్సిల్‌లో తీర్మానించడం, వీరి తీర్మానానికి స్పందించిన ప్రభుత్వం కార్పొరేషన్ చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. జీవో జారీ చేసిన నాడు పాలకవర్గ కూడా రద్దవుతుందని చట్టం చెబుతోందన్నారు. ఈ కారణంగానే ఇటీవల ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశాన్ని కూడా పాలకవర్గం విధివిధానాలు రాలేదన్న సాకుతో వాయిదా వేసిందని నాని ఆరోపించారు.