కృష్ణ

కాపు రిజర్వేషన్ పేరుతో.. బీసీలను అణగదొక్కే యత్నాల్ని సాగనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 4: ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్ పేరుతో బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కెపి రెడ్డయ్య విమర్శించారు. కాపు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బిసి సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న బిసిలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రెడ్డయ్య మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ వల్ల బిసిలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రెండు వర్గాలను మోసం చేసే ధోరణి చంద్రబాబు కనబరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని, వారిని బిసిల్లో చేర్చాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పరిటాల కోటేశ్వరరావు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన సామాజిక న్యాయసూత్రానికి విరుద్ధమైనదన్నారు. రిజర్వేషన్‌లు సాంఘిక వివక్ష, అణచివేతకు సంబంధించినవే కానీ ఆర్థిక అంశం కాదన్నారు. గతంలో మద్రాసు ప్రభుత్వం కమ్యూనల్ జీవో ద్వారా కాపులకు, శూద్ర, బ్రాహ్మణ, వైశ్యులు, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఇప్పటికీ కాపులు అలాంటి కమ్యూనల్ జీవో ద్వారా బిసిలుగా కాకుండా కాపులుగానే రిజర్వేషన్లు పొందడం సామాజిక న్యాయమవుతుందన్నారు. రాష్ట్ర కార్యదర్శి అంగడాల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ కాపులు, బిసిల మధ్య వివాదాలు సృష్టించే అగ్రకుల రాజకీయ పార్టీల ఎత్తుగడలను చిత్తు చేయడానికి కాపులు, బిసిలు కలిసి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులు యలవర్తి ఆంజనేయులు, చండిక రాంబాబు, అందె జగదీష్, సురేష్‌కుమార్, లోయి లక్ష్మయ్య, శేకుబోయిన సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.