కృష్ణ

ప్రభుత్వ బండారం బయటపడుతుందనే నిరంకుశ వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 18: వ్యవసాయ మార్కెట్ కమిటీలో మిర్చి కొనుగోళ్లను పరిశీలించి రైతులకు అండగా ఉండేందుకు వెళుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. వైసిపి నేతల ముందస్తు అరెస్టులను ఖండిస్తూ గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనైతిక చర్యలతో మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు మిర్చి కొనుగోళ్ల వద్దకు వెళితే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న దురుద్దేశంతోనే పోలీసులతో అప్రజాస్వామికంగా ముందస్తు అరెస్టులకు పాల్పడిందని విమర్శించారు. పోలీస్, మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్బంధ పరిస్థితులను సృష్టించి తప్పనిసరై రైతులు అయినకాడికి తెగనమ్ముకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు వ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన విధంగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మంగునూరు కొండారెడ్డి, చల్లా బ్రహ్మేశ్వరరావు, కొమ్మినేని రవిశంకర్, ఎన్ శివనాగేశ్వరరావు, ఎండి మస్తాన్, కత్రోజు శ్రీనివాసాచారి, బండి మల్లికార్జునరావు, చిరుమామిళ్ల చైతన్యకుమార్, బొగ్గవరపు రవీంద్ర, షేక్ ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు పాఠశాలలకు చేరిన బాలికల సైకిళ్లు
కూచిపూడి, మే 18: ఎట్టకేలకు బడికి వస్తా కార్యక్రమం ద్వారా మొవ్వ మండలంలో 9వ తరగతి బాలికలకు సైకిళ్లను ఆయా పాఠశాలలకు గురువారం అందచేశారు. మండలంలోని తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులకు, సిఆర్‌పిల ద్వారా ఎంఇఓ తోట వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. పాఠశాలలు పునః ప్రారంభించిన తరువాత బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని కూచిపూడికి 31, భట్లపెనుమర్రుకు 21, పెడసనగల్లుకు 14, నిడుమోలుకు 38, కోసూరుకు 22, పెదముత్తేవికి 14, చినముత్తేవికి 14, కాజకు 49 సైకిళ్లను సిఆర్‌పిలు తాతా సమర్పణరావు, ఉపాధ్యాయులు బి మాణిక్యాలరావు, చింతా రామమూర్తి, ఆంజనేయులు, కృష్ణార్జునరావు, నాగరాజు, సిహెచ్ శివన్నారాయణ, బి శివ కుమార్‌ల ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సైకిళ్లు అందచేశారు.

ఆ జీవోలను రద్దు చేయండి
ఇంద్రకీలాద్రి, మే 18: జివో నెంబర్ 279, 159, 160లను రద్దు చేయాలని, జివో 151 ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ కార్మికులను 010 పద్దు కింద జీతాలు, హెల్త్ కార్డులు అందచేయాలన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులను బానిసలుగా మార్చి ప్రజలపై భారాలు మోపే జివో నెంబర్ 279, 159 రద్దు చేయటంతోపాటు, 160 జివో ద్వారా ఇచ్చిన టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయలని ఆయన డిమాండ్ చేశారు.

జస్టిస్ కట్జూవి జగన్ ప్రేరేపిత వ్యాఖ్యలు
* వర్ల రామయ్య విమర్శ
విజయవాడ క్రైం, మే 18: సోషల్ మీడియాలో ఒక దళిత మహిళపై అవమానకరంగా పోస్ట్ చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే జస్టిస్ కట్జూను ప్రభావితం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ద్వారా రద్దు చేయమని ఆయనతో ప్రకటన చేయంచటం ప్రతిపక్ష నేత జగన్ అవివేకానికి నిదర్శనమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కట్జూ ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా, అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరటం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఏ ప్రభుత్వాన్నయనా చట్టబద్ధంగా అన్ని విభాగాలు నిర్వీర్యమైనప్పుడు, అచేతనంగా మారినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. అంతేగాని జగన్ ద్వారా ప్రేరేపితుడైన జస్టిస్ కట్జూ చెప్పినట్లు దళిత మహిళను అవమానించిన రవికిరణ్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయటం కుదరదన్నారు. జగన్ భవిష్యత్తు అంధకార బంధురంగ