కృష్ణ

దళితుల విద్యాభివృద్ధికి సీట్ల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: దళితుల విద్యాభివృద్ధి చర్యల్లో భాగంగా ఉత్తమ విద్యాలయాల్లో చదువుకునేందుకు అవసరమైన అదనపు సీట్ల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఉత్తమ విద్యాలయాల్లో సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తున్నామని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి జిల్లాలో గతంలో ఉన్న సీట్లకు అదనంగా రెసిడెన్షియల్‌లో 50 సీట్లను, డేస్కాలర్‌లో 100 సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనంగా రూ. 4.55 కోట్లను ఖర్చు చేయనుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వలన రెసిడెన్షియల్ విద్యా విధానంలో 650 సీట్లు, డేస్కాలర్ ద్వారా 1300 సీట్లు అదనంగా పెరుగుతాయని మంత్రి వివరించారు. రెసిడెన్షియల్ పద్ధతిలో చదువుకునేందుకు ఒక్కో విద్యార్థికి రూ. 30వేలు, డేస్కాలర్ పద్ధతిలో చదువుకునే విద్యార్థులకు రూ. 20వేలు ప్రభుత్వం ఫీజుగా చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. 2017-18 విద్యా సంవత్సరం నుంచే ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయని, ఇందుకు సంబంధించిన నిధులను ఎస్సీ సబ్‌ప్లాన్ నుండి ఖర్చు చేస్తున్నట్లు ఆయన అన్నారు. సాంఘీక, సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలకు దివంగత జిఎంసి బాలయోగి గురుకులంగా నామకరణం చేస్తున్నామని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల చేయనుందని మంత్రి రావెల తెలిపారు.

ఐకానిక్ భవనాల డిజైన్ల పరిశీలన
* లండన్‌లో నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 22: రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లను మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీ్ధర్ పరిశీలించారు. లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయంలో ఈ భవనాలకు సంబంధించి నాలుగు డిజైన్లను సిద్ధం చేయగా, మంత్రి పరిశీలించారు. 25న ఆ సంస్థ ప్రతినిధులు ఆ డిజైన్లను ఇక్కడి అధికారులకు అందచేయనున్నారు.

వైభవంగా స్వామివారి
కల్యాణోత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శైవాలయాల్లో స్వామివారి క ల్యాణ మహోత్సవాలు బుధవారం వై భవంగా ప్రారంభమైయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీమల్లేశ్వరస్వామివారి సన్నిధిలో స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివ ప్రసాద్, ఇవో ఎ సూర్యకుమారి దంపతులను పీఠాలపై కూర్చోబె ట్టి నిష్ఠగా ఉత్సవాలను నిర్వహించారు. దత్తత దేవాలయమైన పాతబస్తీ శ్రీ బ్రాహ్మణ వీధి శ్రీ వసంత మల్లిఖార్జునస్వామి దేవస్థానం (బుద్దావారి గు డి)లో దుర్గగుడి సహాయ ఇవో శ్రవణం దంపతులు పూజలు నిర్వహించారు. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వా మి దేవస్థానం (పాతశివాలయం)లో ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో ఈవేడుకలు ప్రా రంభమైయ్యాయి. ఇవో కెవియన్‌డికె ప్రసాద్ దంపతులను పీఠాలపై కూర్చోబెట్టారు. అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవ పుష్పాలతో వేదికను అలకరించి ఉత్సవ మూర్తులను ఉంచా రు. స్వామివారికి పెండ్లికుమారుని అ లంకారం చేశారు. శ్రీకన్యక పరమేశ్వరి అన్నసత్రం కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చి సంప్రదాయ ప్రకారం స్వా మి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
సాయంత్రం 7గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణలు వంటి వైదిక కార్యక్రమాలను నిష్ఠతో నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వరస్వామి దేవస్థానంలో కమిటీ చైర్మన్ వెలంపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారి కల్యా ణ మహోత్సవాలు ప్రారంభమైయ్యా యి. పర్యవేక్షణాధికారి శేషు ఆదేశాల మేరకు ప్రధాన అర్చకుడు విజయానందశర్మ స్వామిని పెండ్లికుమారునిగా అలంకరించారు. సాయంత్రం 6-30 గంటలకు స్వామి సన్నిధిలో విఘ్నేశ్వర పూజ, పుణ్యావాహనం, రుత్వికరణ, అఖండ స్థాపన, అంకురారోహణ నిర్వహించగా, దేవరశెట్టి వెంకట చెంచయ్య పట్టు వస్త్రాలను సమర్పించారు.

పాతాళ భోగేశ్వరునికి మంత్రి పట్టు వస్త్రాల సమర్పణ
కలిదిండి, ఫిబ్రవరి 22: పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి మహాశివరాత్రి కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ స్వామివారికి పట్టుపీతాంబరాలను సమర్పించారు. స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారుడుగా, పెండ్లి కుమార్తెగా అలంకరించారు. స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి అనంతరం ఆలయానికి రూ.10లక్షల వ్యయంతో మంచినీటి సరఫరా చేసేందుకు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ఎంపిపి బండి లక్ష్మి, జెడ్పీటిసి నున్నా రమాదేవి, కలిదిండి సర్పంచ్ షేక్ నాజీమ, ఎంపిటిసి లంకా రత్నారావు, బిజెపి మండల అధ్యక్షుడు గుర్రాల శ్రీరామమూర్తి, జిల్లా టిడిపి నాయకుడు వల్లభనేని శ్రీనివాస చౌదరి, పేకేటి చలపతిరావు, సత్యన్నారాయణ, ఆలయ మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్టేడియంలో 26వ జూనియర్ జాతీయ బేస్‌బాల్ పోటీలు ప్రారంభం
గుడివాడ, ఫిబ్రవరి 22: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 26వ తేదీ వరకు జరిగే 26వ జూనియర్ జాతీయ బేస్‌బాల్ పోటీలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యలవర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నది నిజమైనప్పటికీ క్రీడల ద్వారా కూడా ఉన్నతస్థాయికి ఎదిగినవారు అనేకమంది ఉన్నారన్నారు. క్రీడల వల్ల చిన్నారుల్లో మానసిక వత్తిడి తగ్గుతుందని, శారీరకంగా బలంగా ఉంటారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా క్రీడాకారులు ప్రతిభను మెరుగుపర్చుకోవాలన్నారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించారు. ముందుగా పలు రాష్ట్రాల క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం జరిగిన లీగ్ పోటీల్లో బాలుర విభాగంలో పశ్చిమబెంగాల్ జట్టుపై పంజాబ్ జట్టు, కర్ణాటక జట్టుపై మహరాష్ట్ర జట్టు, గుజరాత్ జట్టుపై ఆంధ్రప్రదేశ్ జట్టు, బాలికల విభాగంలో బీహార్‌పై కర్ణాటక జట్టు, ఆంధ్రప్రదేశ్ జట్టుపై కేరళ జట్టు, హర్యానా జట్టుపై పంజాబ్ జట్టు గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో జాతీయ బేస్‌బాల్ టెక్నికల్ కమిటీ చైర్మన్ హరీష్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం అచ్యుతరావు, కార్యదర్శి ఎంవిఎస్ ప్రసాద్, కోశాధికారి ఎస్ సాంబశివరావు, అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఎన్ రాజేంద్ర, జిల్లా సభ్యులు పి నవీన్‌కుమార్, టి శ్రీలత, ఎం సునీత, మడకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

2018 మే నాటికి
విస్తరణ పనులు పూర్తి కావాలి
* 420 రోజుల్లో 64 కిలోమీటర్లు రహదారి విస్తరణ
* అధికారులకు కలెక్టర్ బాబు ఎ ఆదేశాలు
విజయవాడ, ఫిబ్రవరి 22: విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 2018 మే నాటికి పూర్తిచేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి ఎన్.హెచ్-9 పనుల పురోగతిని బుధవారం కలెక్టర్ బాబు.ఎ ఆయన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సు హాలునందు జాతీయ రహదారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ తొమ్మిదేళ్లుగా ప్రజల కల అన్నారు. మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల స్థాపన, నూతన రాజధాని అమరావతికి ప్రధాన రహదారిని నిర్దేశించిన సమయానికంటే ఆరునెలలు ముందుగా పనులు పూర్తిచేసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్‌హెచ్‌డిపి ఫేజ్-3లో భాగంగా నాలుగులైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆశించినస్థాయిలో సమాంతరంగా జరగకపోవటం పట్ల కలెక్టర్ ఆసహనం వ్యక్తం చేస్తూ రోజువారీ పనుల పురోగతి కనపడాలన్నారు. అధికారులు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఇటువంటి ప్రాజెక్టుల చేపట్టడం ఒకేసారి వస్తుందని దీనిని ఒక అదృష్టంగా భావించాలన్నారు. 64కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జాతీయ రహదారి విస్తరణను వారానికి ఒక కిలోమీటరు చొప్పన 420 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. పనులు అన్నిచోట్ల సమాంతరంగా జరగాలన్నారు. ఏశాఖ వద్ద విస్తరణకు సంబంధించిన పనులు పెండింగ్ ఉండరాదని ప్రతీ పదిమీటర్లకు ఒక టిప్పర్ కనపడాలన్నారు. 1500 టిప్పర్లతో పనులు జరగాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా స్ట్రక్చర్ల నిర్మాణాలకు సమీక్షిస్తూ రవాణా విస్తరణలో నష్టపరిహారం చెల్లించిన నిర్మాణాలను తక్షణమే నిర్మూలించాలన్నారు. విస్తరణలో ప్రభుత్వాలకు సంబంధించిన నిర్మాణాలు అడ్డువస్తే తక్షణమే తొలగించి పనులు చేపట్టాలని ఆదేశించారు. మేజర్ స్ట్రక్చర్ మినహా ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నారు. మతపరమైన నిర్మాణాలకు ప్రత్యామ్నాయ స్థలాలను చూపాలని కలెక్టర్ సంబంధిత మండల తహసీల్దార్లను ఆదేశించారు. విస్తరణలో ఎదురవుతున్న ఆటంకాలను 90శాతం తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించుకోవాలన్నారు. తహసీల్దార్లు ప్రతిరోజూ, డివిజనల్ అధికారులు వారానికి ఒకరోజు పరిశీలించాలన్నారు. జాతీయ రహదారిపై తరకటూరు వద్ద గడ 3నెలలుగా సమ్మర్‌స్టోరేజ్ వాటర్ పైపు ఉన్నాయని వాటిని త్వరితగతిని వినియోగించాలన్నారు. రోజువారీ పనుల ప్రగతిని టెలిగ్రామ్ యాప్‌లో ఫొటోలు అఫ్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డిఆర్వోవో చెరుకూరి రంగయ్య, సబ్ కలెక్టర్ బాలాజీ, ఆర్డీవోలు చక్రపాణి, సాయిబాబా, ప్రాజెక్టు డైరెక్టర్ టి.సురేష్‌కుమార్, టీం లీడర్ ఎస్‌కె గుప్త, దిలీప్, ప్రాజెక్టు మేనేజర్ మధుబాబు, మచిలీపట్నం, గంగూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.