కృష్ణ

అమరవీరుల కుటుంబాలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: సమాజ భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు నండూరి సాంబశివరావు చెప్పారు. ఆయా కుటుంబాల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, పోలీసు శాఖ ఆరోగ్య భద్రతతోపాటు, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు - విజయవాడ నగర పోలీసు శాఖ ఆధ్వర్యాన ఘనంగా అమర వీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో భాగంగా పలు పోటీలు నిర్వహించామన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగే ‘స్మృతి పరేడ్’కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నట్లు చెప్పారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ భారత్, చైనా సరిహద్దులో 1959లో జరిగిన చైనా సైన్యం దాడుల్లో పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమం జరుపుకుంటున్నట్లు చెప్పారు. అంతర్గత సమాజ భద్రత కోసం పాటు పడుతున్న పోలీసుల్లో ఎంతోమంది తమ ప్రాణాలు పణంగా పెట్టారని, రాష్ట్రంలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాస్, ఉమేష్‌చంద్ర, పరదేశీనాయుడు వంటి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ఎందరో విధి నిర్వహణలో బలైపోయారన్నారు. ఇలా ప్రతి ఏడాది విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని, గత ఏడాది 163 మంది మరణిస్తే, ఈ ఏడాది 14 మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అట్టి కుటుంబాలకు పోలీసు శాఖ అండగా నిలబడుతోందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలను ఆదుకుంటోందన్నారు. ప్రతి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా అట్టి కుటుంబాలను పిలిపించడం కాకుండా.. ప్రతి జిల్లాలోనూ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా ఆయా కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. దివంగత సిబ్బంది కుటుంబాలు తమ కుటుంబాలేనని డిజిపి చెప్పారు. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు ఇస్తోందని, గత ఏడాది ముఖ్యమంత్రి 15 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఈసారి కూడా ప్రభుత్వం పోలీసు శాఖ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇక సిబ్బంది ఆరోగ్యం విషయానికొస్తే నగరంలోని 2500 మంది సిబ్బందిలో 37 శాతం రోగాల బారిన పడటం దురదృష్టకరమని, దీని దృష్ట్యా రాష్ట్ర పోలీసు శాఖలోని సిబ్బంది మొత్తానికి ప్రతి ఏడాది వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించేలా డీప్ ఫౌండేషన్‌తో కలిసి ప్రణాళిక రూపొందించామన్నారు. కాల పరిణామ క్రమంలో నక్సల్స్‌ని ఎదుర్కోడంలో ఏపి పోలీసుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, అదనపు డిజిపిలు ఎన్‌వి సురేంద్రబాబు, ఆర్‌పి ఠాకూర్, ద్వారకా తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.