కృష్ణ

అధికారులకు రూపాయచ్చినా నామీదొట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, అక్టోబర్ 23: ‘అధికారులు ఒక్క రూపాయి తీసుకుంటే నా మీద ఒట్టు’ అని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో కైకలూరు నియోజకవర్గ స్థాయిలో 1250 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణాలకు రూ.20కోట్లు కేటాయించామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 50వేలు అందిస్తున్నామన్నారు. ఏ అధికారికి అయినా ఒక్క రూపాయి ఇచ్చినా నా మీద ఒట్టు అన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు ప్రొవిజినల్ సర్ట్ఫికెట్‌ను మంజూరు చేశారు. గృహ నిర్మాణాలకు ప్రభుత్వం రూ.3,500 కోట్లు మంజూరు చేస్తోందని, కలిదిండి మండలంలో 330 మందికి గృహాలు మంజూరయ్యాయన్నారు. మండలం ఆర్థికంగా ప్రథమ స్థానంలో నిలవడానికి చేపల చెరువులే కారణమన్నారు. పాత చెరువులు తిరిగి తవ్వుకునేందుకు అనుమతులు అవసరం లేదన్నారు. ట్రాక్టర్‌పై ఇసుక, బుసక తరలిస్తే పర్వాలేదన్నారు. లారీల ద్వారా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ 70 రకాల రోగాలకు ఉచిత వైద్యం అందించేందుకు రాష్ట్రంలో 13వేల మంది ఎఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వం వైద్యశాలలో ఓపిల సంఖ్య పెరుగుతుందన్నారు. స్థానిక పిహెచ్‌సిలో 19 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. మరో నాలుగురోజుల్లో కాలువల ద్వారా నీరు విడుదల అవుతుందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికి వైకాపా అనుక్షణం అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య చిచ్చుపెట్టి రాష్ట్భ్రావృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అధికారంలోకి రావన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బండి లక్ష్మి, జెడ్పీటిసి నున్నా రమాదేవి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, కలిదిండి సర్పంచ్ షేక్ నాజీమ, ఎన్ పూర్ణచంద్రరావు, ఎంపిటిసి లంకా రత్నారావు, మండల బిజెపి అధ్యక్షులు గుర్రాల శ్రీరామమూర్తి, మండల టిడిపి అధ్యక్షులు పోకల జోగిరాజు, జిల్లా టిడిపి నాయకులు వల్లభనేని శ్రీనివాస చౌదరి, చిట్టూరి రవీంద్ర, బిజెపి నాయకులు నంబూరి నాగబాబు, సత్తిరాజు, రెవెన్యూ, హౌసింగ్, వైద్య, విద్య, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.