కృష్ణ

పేదలకు మెరుగైన వైద్యసేవలే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 23: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక రవీంద్ర భారతి హైస్కూల్‌లో ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపి కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ కింద 1040 వ్యాధులకు రూ.2.50 లక్షల వరకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తుందన్నారు. చిన్నచిన్న వ్యాధుల పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రభుత్వాసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రా హాస్పటల్ సహకారంతో కంటిచూపు, గుండె, గర్బిణీ సంబంధిత వైద్యం ఉచిత క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రూ.10.50కోట్లతో 150 పడకల మాతా శిశు విభాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించినట్లు తెలిపారు. నవంబరు 15వ తేదీలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు మెరుగు చేయటంతో ఓపిలో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. నిరుపేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీఠ వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ ఛైర్మన్ కాశీవిశ్వనాధం, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, కౌన్సిలర్ గౌసియా బేగం, పట్టణ టిడిపి అధ్యక్షులు ఇలియాస్ పాషా, ఆంధ్రా హాస్పటల్ వైద్యులు సయ్యద్ ఖాజా, తదితరులు పాల్గొన్నారు.