కృష్ణ

త్వరలో గ్రామీణ విద్యార్థులకూ ఐఐటి ఫౌండేషన్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 10: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం ఐఐటి ఫౌండేషన్ తరహా శిక్షణను అందుబాటులోకి తెస్తున్నట్టు విద్యాశాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యా వసతుల కోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నప్పటికీ ఆశించినంత ఫలితాలను సాధించలేకపోతున్న వైనం గర్హనీయమని, ఇందుకు ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనబడుతోందన్న విషయాన్ని గుర్తించి టీచర్లు బాధ్యతగా విద్యాబోధన చేయాలని హితవుపలికారు. ప్రైవేటు విద్యార్థులతో పోటీగా ప్రభుత్వ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన విద్యార్థులే రానున్న కాలంలో ర్యాంకులు సాధించే దిశగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న ఐఐటి ఫౌండేషన్ విద్యా బోధనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు గాను ఆదివారం ఉదయం నగరంలోని గవర్నర్‌పేట ఐవి ప్యాలెస్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ టీచర్ల బాధ్యతారాహిత్యమే విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు శాపంగా మారుతోందని, బెస్ట్ టీచర్లు, సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఎటువంటి ర్యాంకులు సాధించలేకపోతున్న వైనం శోచనీయమన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న ఫలితాలు రాలేకపోతున్న వైనం నుంచి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేద విద్యార్థులు సైతం ఇంటర్ తరువాత జరిగే అన్ని తరహా పోటీ పరీక్షలలో మెరుగైన ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించే విధంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారుచేస్తామన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో వారు బోధించే విద్యార్థుల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకొని 25శాతం వెయిటేజ్ కల్పిస్తామన్నారు. మారుతున్న ఆధునిక సమాజంలో విద్యాభ్యున్నతికై టీచర్ల బాధ్యతలను మెరుగుపర్చాలన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఐఐటి ఫౌండేషన్ శిక్షణను కేవలం పట్టణాలకే పరిమితం కాకండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టేందుకు విస్తృత చర్యలు తీసుకొంటామన్నారు. మున్సిపల్ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ దేశంలోని 2500 ఐఐటి సీట్లలో సింహభాగం మున్సిపల్ విద్యార్థులే సాధించేలా చేయడమే తన లక్ష్యమని, కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మున్సిపల్ స్కూల్స్‌ను తీర్చిదిద్ది 2018 నాటికి మన రాష్ట్రంలో సాధించే ర్యాంకులు అత్యధికం మన విద్యార్థులే సాధించే దిశగా చర్యలు తీసుకొంటున్నామని, ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమన్నారు. గత సంవత్సరం ప్రారంభించిన ఫౌండేషన్ కోర్సుపై కొంతమంది దుష్ప్రచారం చేయడం శోచనీయమన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే అన్ని పోటీ పరీక్షల్లో మున్సిపల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చేవరకూ నిరంతర కృషి చేస్తానన్నారు. 1997లో ఐఐటి పోటీ పరీక్షల్లో కేవలం 100 మంది మాత్రమే ర్యాంకు సాధిస్తే వాటిలో 50 సీట్లు మన రాష్ట్రం నుంచే ఎంపిక అయ్యేవారన్నారు. మొత్తం 1500 మున్సిపల్ స్కూల్స్‌లలో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తే వారిలో కేవలం 12 మంది మాత్రమే 10కి 10 పాయింట్లు సాధిస్తుండగా కేవలం రెండు ప్రైవేటు పాఠశాలల నుంచి వెయ్యి మందికి పైగా 10కి 10 పాయింట్లు సాధిస్తున్న తీరును మార్చి 2018లో కార్పొరేట్ విద్యార్థుల కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ ర్యాంకులు సాధించే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుతున్నట్టు తెలిపారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి విద్యా కమిటీ చైర్మన్ షేక్ నజీర్ హుస్సేన్, కార్పొరేటర్ బాలస్వామి, అదనపు కమిషనర్ పి అరుణ్‌బాబు, డివైఇవో దుర్గాప్రసాద్, ప్రాజెక్టు ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.