కృష్ణ

అక్రమార్కులకు వరంగా ‘ఉచిత ఇసుక’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం రవాణా నిరోధించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ఆచరణలో అమలవుతున్న దాఖలాలు లేవు. రాష్ట్ర సరిహద్దులు దాటి లారీల్లో భారీగా ఇసుక తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాదుకు తరలివెళుతోంది. ఇసుక వ్యాపారాన్ని బడా వ్యక్తులు చేయడంతో మార్గంమధ్యలో అడ్డుకున్న అధికారులకు ముడుపులు ముట్టజెప్పడానికి భారీ ఎత్తున నగదు ఇసుక లారీలకు ఎస్కార్ట్‌గా కారులో కొందరు వ్యక్తులు వెళ్లడం గమనార్హం. జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద రవాణా చెక్‌పోస్టు ఉన్నా అక్రమార్కులు యథేచ్ఛగా హైవే మార్గంలోనే ఇసుక లారీలను తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో హైవేపై ఉన్న గరికపాడు వద్ద పోలీసు చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహించగా రెండు రోజుల్లో నాలుగు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. మంగళవారం తెల్లవారుఝామున చిల్లకల్లు పోలీసులు రెండు ఇసుక లారీలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు. అయితే వీటితోపాటు నిర్వాహకుల నుండి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న వాహనాలను విడిపించుకునేందుకు సదరు వ్యక్తులు రాజకీయ పార్టీ నేతల ద్వారా పైరవీలు చేస్తూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదిలావుండగా రావిరాల, వేదాద్రి ఇసుక క్వారీలతో పాటు పాలేరు నుండి భారీగా ఇసుక తరలివెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక శాఖకు చెందిన అధికారే అక్రమ ఇసుక రవాణాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.