కృష్ణ

రాజధానిలో నిర్మాణ రంగానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఏప్రిల్ 10: నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం అనతికాలంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగంపై క్షేత్రస్థాయిలోనే అవగాహన ఎంతో అవసరమని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ అన్నారు. షైనీ ట్రేడ్ ఎక్స్‌పొజిషన్స్ ఆధ్వర్యంలో విజయవాడలోనే తొలిసారిగా ఏపి కన్‌స్ట్రక్షన్ ఎక్స్‌పో, ఏపీ బిల్డ్‌టెక్ ఎక్స్‌పో, అమరావతి ప్రాపర్టీ షోను ఆదివారం ఏ ప్లస్ కనె్వన్షన్ హాల్‌లో నారాయణ మరో మంత్రి పుల్లారావుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణ నేపథ్యంలో ఈ ప్రాంతంలో లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు నిర్మితవౌతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలివస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు సైతం ఇళ్లు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ స్థితిలో నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం అనూహ్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి అవసరమై సూచనలు, సలహాలు, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో పని చేస్తుందన్నారు. దేశ, విదేశీ పరిజ్ఞానాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చి రాజధాని నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణదారులకు, ఉత్పత్తిదారులకు ఇటువంటి ఎగ్జిబిషన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోనికి తీసుకురావడంతో పాటు అవగాహన కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ఛర్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ ఎస్ రమేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్కిటెక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేకానంద స్వామితో పాటు పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు ఎగ్జిబిషన్‌లో భాగంగా ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుంచి పాండురంగారావు నాణ్యమైన నిర్మాణాలు, సాంకేతిక పరిజ్ఞానం, ముడి వనరులు అనే అంశంపై వివరించారు. స్కూల్ ఆఫ్ ఆర్కిటీక్ఛర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ నిర్మాణ రంగంలో ఆధునిక పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో భూసార పరీక్ష ప్రాధాన్యం అనే అంశంపై కెఎల్ ఇంజనీరింగ్ నుంచి హనుమంతరావు మాట్లాడారు.