కృష్ణ

గన్నవరం ఎయిర్‌పోర్టులో అరుణ్ జైట్లీకి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, అక్టోబర్ 28: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఘన స్వాగతం లభించింది. అమరావతి రాజధాని పరిపాలనా కార్యాలయ భవన సముదాయానికి శంకుస్థాపన చేసేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి అదే విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వీరికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, రాష్ట్ర బిసి సంక్షేమ, ఎక్సైజ్, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశాఖ, మచిలీపట్నం, నరసాపురం, విజయవాడ ఎంపిలు కేశినేని నాని, హరిబాబు, కొనకళ్ల నారాయణరావు, గోకరాజు గంగరాజు, గన్నవరం, పెనమలూరు, విశాఖ ఎమ్మెల్యేలు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, బోడే ప్రసాద్, విష్ణువర్థనరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి నాదెండ్ల మోహన్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురావు నర్రా మాలతి, నియోజకవర్గ అధ్య/క్షరడర జయరాజు, నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీశ, తాహశీల్దార్ మాధురి స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు పతాకాలు చేతబట్టి జైట్లీ ప్లకార్డులు, డప్పు విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు.
సాదర వీడ్కోలు
అమరావతి కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర అరుణ్‌జైట్లీ శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు జైట్లీకి ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ బాబు, అధికారులు, అనధికార ప్రముఖులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. అనంతరం మంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.