కృష్ణ

మంత్రి ఉమ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, అక్టోబర్ 28: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇటీవల కార్యకర్తల సమావేశంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించటానికి బహిరంగ వేదికపైకి రావాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జోగి మంత్రి ఉమపై విరుచుకుపడ్డారు.
తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలనుండి అనూహ్యమైన స్పందన లభిస్తుంటే మంత్రికి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని దీంతో ఏం చేయాలో తోచక తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగి పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. టిడిపి కార్యకర్తల సమావేశంలో తనపై జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసి కార్యకర్తల ముందు కాలరెగరేస్తున్నాడని మంత్రి ఇంత నీచస్థితికి దిగజారటమా అని జోగి ప్రశ్నించారు. తాను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు ప్రభుత్వ స్థలం అని ఆక్రమించుకుని నివాసం ఉంటున్నానని మంత్రి ఆరోపణలను జోగి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను మంత్రికి పంపుతానని లేకపోతే బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే తాను స్వయంగా హాజరవుతానని జోగి ప్రకటించారు. అదేవిధంగా పెడన ఎమ్మెల్యేగా తాను పని చేసినప్పుడు పెదలంక డ్రైన్ మరమ్మతులలో కుంభకోణానికి పాల్పడినట్లు మంత్రి ఆరోపణలు చేస్తున్నాడని ప్రస్తుతం అధికారంలో ఉండటంతోపాటు సాక్షాత్తూ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఉమ పెదలంక డ్రైన్ మరమ్మతు పనులపై విచారణ జరిపించుకోవచ్చని సవాల్ చేశారు. అదేవిధంగా తాను ఉంటున్న ఇంటిస్థలం ప్రభుత్వానిదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఉమ దీనిపై కూడా విచారణ జరిపించి అక్రమమైతే చర్యలు తీసుకోవచ్చని జోగి పేర్కొన్నారు. కార్యకర్తల మెప్పుకోసం చౌకబారు విమర్శలు చేయటం మంత్రికి తగదన్నారు. జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అభివృద్ధితో పోలిస్తే కనీసం పది శాతం అభివృద్ధి కూడా మంత్రిగా ఉమ ఈనియోజకవర్గంలో చేసింది లేదన్నారు. తాము గ్రామాలలోకి వెళుతుంటే ప్రజలే స్వయంగా తమకు చెబుతున్నారని ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైఎస్ జగన్ కోరుతుంటే ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఉమకు ఇంగిత ఙ్ఞనం ఉందా అని ప్రశ్నించారు. హోదా వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని, ప్యాకేజీ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి ఉమకు జేబులు నిండుతాయని జోగి ఎద్దేవా చేశారు. అదేవిధంగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాలో పంటలు పండలేదని, తుఫాన్ల వల్ల వచ్చిన వరద నీటితోనే పంటలు పండాయని జోగి స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు, లోకేష్ బాబు, ఉమకు జేబులు నింపటానికే ఉపయోగపడిందని జోగి ఆరోపించారు. మంత్రి ఉమకు లాగా తాను కోటీశ్వరుని కుటుంబం నుండి రాలేదని, పేదరికం నుండే వచ్చానని చెప్పారు. కానీ ఉమ మాత్రం ఇసుక సీనరేజి, మద్యం సిండికేట్, టోల్‌గేట్ వసూళ్ళ ద్వారా అక్రమంగా, దౌర్జన్యంగా కోట్లు గడించారని జోగి ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు మంత్రి సిద్ధంగా ఉన్నాడా అని సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలను ఖండించేందుకు ఉమ తన వందిమాగదులను పంపవద్దని తానే స్వయంగా రావాలని కోరారు. అదేవిధంగా తనపై మంత్రి చేసిన ఆరోపణలను నిరూపించాలని కూడా జోగి కోరారు.