కృష్ణ

దశ, దిశ లేని బాబు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 3: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ, దిశ లేని పాలన సాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్ళం రాజు మండిపడ్డారు. బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల కోసం ప్రభుత్వం విడుదల చేసిన భూసమీకరణ నోటిఫికేషన్, ల్యాండ్ పూలింగ్ జివోలను రద్దు చేయాలని కోరుతూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి మూడవ రోజుకు చేరింది. ఉదయం కరగ్రహారంలోని శ్రీ బాబా ఫరీద్ మస్తాన్ అవులియా (దర్గా)లో బాబా సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కరగ్రహారం, గరాలదిబ్బ, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన, తుమ్మలచెరువు, పాతేరు గ్రామాలలో భూ పరిరక్షణ పోరాట సమితి నాయకులు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రకు హాజరైన కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు మాట్లాడుతూ రైతులను మోసం చేసి పెట్టుబడిదారులకు భూములను ధారాదత్తం చేసేందుకు టిడిపి సర్కార్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టుకు 2వేల ఎకరాలు చాలని చెప్పిన నాయకులు నేడు అధికారంలోకి రాగానే 33వేల ఎకరాలు అవసరం వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రభుత్వ భూ దోపిడీయేనని ధ్వజమెత్తారు. భూములు కోల్పోయే రైతులకు భూ పరిరక్షణ పోరాట సమితితో పాటు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుందన్నారు. పోర్టు, పరిశ్రమలకు సెంటు భూమి కూడా ఇవ్వదని రైతులకు విజ్ఞప్తి చేశారు. మాజీ శాసనమండలి సభ్యులు జెల్లి విల్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలో బలవంతంగా భూములు సేకరించి భూ బ్యాంక్‌కు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బందరు ప్రజల చిరకాల వాంఛ పోర్టు నిర్మాణానికి ప్రజలు, రైతులు అంగీకారం తెలుపుతున్నారని, అదే అదునుగా భావించిన చంద్రబాబు వేలాది ఎకరాలు సమీకరించాలని చూస్తున్నారన్నారు. జీవో నెం. 188ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రైతులంతా తమ భూములను కాపాడుకోవటానికి ఐక్యంగా పోరాడాలన్నారు. ఈ విషయంలో పోలాటితిప్ప గ్రామ రైతుల పోరాట పటిమను ఆయన అభినందించారు. ఇదిలా ఉండగా గరాలదిబ్బ గ్రామం నుండి పోలాటితిప్ప గ్రామం వెళ్ళేందుకు గాను భూ పరిరక్షణ పోరాట సమితి నాయకులు కృష్ణానది పాయలో పడవ ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ, రైతు సంఘం నాయకులు సిహెచ్ కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, సుంకర పద్మశ్రీ, సిపిఎం నాయకులు చౌటపల్లి రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, మోదుమూడి రామారావు, దాసరి సాల్మాన్ రాజు, కొల్లాటి శ్రీనివాసరావు, సిహెచ్ జయరావు, సజ్జా మూర్తిరాజు, పంచల నరసింహారావు, షేక్ సలార్ దాదా, మాదివాడ రాము, డా. రాధికా మాధవి, అబ్దుల్ మతీన్, కెవిపిఎస్ నాయకులు పాల్గొన్నారు.