కృష్ణ

ఆంధ్ర పండరీపూర్‌గా వినుతికెక్కిన చిలకలపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 4: ఆంధ్ర పండరీపూర్‌గా పేరుగాంచిన శ్రీ పాండురంగస్వామి ఆలయంలో బుధవారం నుండి కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు టేకి గంగాధరం అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి పాండురంగ క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా కార్తీక మాసోత్సవాలను నిర్వహించాలన్నారు. సాగర తీరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో భక్త నరసింహం వినతి మేరకు కీరపండరీ క్షేత్రంలో 1929వ సంవత్సరం నవంబరు 13వ తేదీ శుక్లనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం నాడు శ్రీ పాండురంగడు స్వయంభువుగా వెలిశారు. ఇచ్చటి అశ్వద్ధ వృక్షం కింద భూమిలో సుమారు 350 సంవత్సరాల క్రితం నుండి ఒక మహా ఋషి తపస్సు కొనసాగిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న పట్టణంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఏకాదశి మహోత్సవాలు నిర్వహించనున్నారు. 9వ తేదీ ఉదయం గణపతి పూజ, గురుపూజ, గోపూజ, శ్రీ లక్ష్మీగణపతి హోమం, 10 ఉదయం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, బ్రహ్మోత్సవం, రాత్రి 7గంటలకు శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 11వ తేదీ ఉదయం రుక్మిణీ దేవికి కుంకుమ పూజలు, మధ్యాహ్నం 3గంటలు నుండి రథోత్సవం, 12వ తేదీన కైలాస మండపంలో అభిషేకాలు, 13 ఉదయం 9గంటలకు విష్ణు, లలిత సహస్రనామ పారాయణలు, రాత్రి 7గంటలకు సహస్ర దీపారాధనలు, 14న గోపాలకాల ఉత్సవం జరుగుతాయని గంగాధరం తెలిపారు.