కృష్ణ

పత్తి రైతుల పాలిట శాపంగా మారిన సిసిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, నవంబర్ 4:పత్తి రైతుల పాలిట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) శాపంగా పరిణమించింది. సిసిఐ కంటే బయట మార్కెట్లోనే పత్తి ధర ఎక్కువ పలుకుతోంది. సిసిఐతో ధరలను పోల్చుకుంటున్న వ్యాపారులు పత్తి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో కొనుగోళ్ళు నిలిచిపోయి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికే ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటుంది. దీనికి గానూ ఖర్చులతో పోల్చి ఒక నిర్దిష్టమైన ధరను నిర్ణయించి రైతులకు సేద్యాన్ని గిట్టుబాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. సిసిఐ కంటే పత్తి ధరలు బహిరంగ మార్కెట్లోనే అధికంగా ఉన్నాయి. మండలంలో ప్రతి ఏడాది దాదాపు పది వేల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తుంటారు. ఇక్కడ మెట్ట ప్రాంతం ఎక్కువ. వర్షాభావాన్ని తట్టుకునేందుకు రైతులు పత్తినే సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే పత్తి దిగుబడులు ప్రారంభమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన పత్తి ధర క్వింటా ఒక్కింటికి 4,600 రూపాయల వరకూ పలుకుతుండగా, సిసిఐ మాత్రం 4,160 రూపాయలు మాత్రమే నిర్ణయించింది. పత్తి నాణ్యతను బట్టి ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. సిసిఐతో పత్తి ధరలను పోల్చుకుంటున్న వ్యాపారులు అమాంతం ధరలను తగ్గించేశారు. ఎక్కడికక్కడ పత్తి కొనుగోళ్ళు నిలిపివేశారు. ప్రసుత్తం పత్తిని చెట్టు నుంచి తీసేందుకు కూలీలకే రైతు క్వింటాకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కూలీలకు, పెట్టుబడికి, కౌలుకు పోనూ ఏమీ మిగలటం లేదని రైతులు వాపోతున్నారు. సిసిఐ ప్రకటించిన మద్దతు ధరతో తమ పరిస్థితి మరింత దిగజారిందని రైతులు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు పత్తికి మద్దతు ధరలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రైతులు పేర్కొంటున్నారు. పత్తి క్వింటాకు 5,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.