కృష్ణ

అంగరంగ వైభవంగా మహా ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 6: పోప్ ఫ్రాన్సీస్ పిలుపు మేరకు దివ్య కారుణ్య సంవత్సరం సందర్భంగా కేథలిక్ రెలిజియస్ ఆఫ్ ఇండియా, పెజ్జోనిపేట ఆర్‌సియం చర్చి విచారణ కర్తలు ఫాదర్ తోట మరియదాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గుణదలలోని బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా మహా ఆరాధన దివ్యసత్ప్రసాద సంధింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు పరమ పవిత్రమైన దివ్యసత్ప్రసాదానికి దీప, దూప, పుష్పార్చనతో మహా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆయన సందేశమిస్తూ కతోలిక క్రైస్తవ జీవిత పరిపూర్ణతకు మూలధారం దివ్యసత్ప్రసాదం అని అన్నారు. దివ్యసత్ప్రసాదం స్వీకరణ అంటే ప్రభువు మనతో ఉన్నారని అర్థమని తెలిపారు. ఫాదర్ పి.జీవన్‌బాబు(వైజాగ్) వాక్యపరిచర్య చేస్తూ దేవుడైన క్రీస్తు అప్పం రూపంలో అవతరించారన్నారు. దివ్యసత్ప్రసాదం ఆరాధనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెజ్జోనిపేట విచారణ కర్తలు ఫాదర్ తోట మరియదాస్ మాట్లాడుతూ ఏసు ప్రభువుతో గడపటానికి ఇటువంటి మహారాధన కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. దివ్యసత్ప్రసాదం ద్వారా ప్రభువుని చేరుకోవచ్చన్నారు. విజయవాడ కతోలిక పీఠం వికర్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ దివ్యసత్ప్రసాదం పట్ల క్రైస్తవులకు విశ్వాసం, గౌరవం పెరగాలన్నారు. నేనే జీవాహారం అని పలికిన ప్రభువు యొక్క సత్యాన్ని ఈ దివ్యకారుణ్య సంవత్సరంలో లోకానికి చాటి చెప్పే అవసరం ఉందన్నారు. అంతకుముందు పెజ్జోనిపేట ఆర్‌సియం చర్చి నుండి ప్రత్యేక అలకరించిన వాహనంపై దివ్యసత్ప్రసాద మందసాన్ని బిఆర్‌టిఎస్ రోడ్డు మీదుగా భక్తులు ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో గుణదలమాత పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు, వికర్ జనరల్ మువ్వలప్రసాద్, ఫాదర్లు డి.రవిశేఖర్, తోట మరియదాస్, ఇంటి అంతోని, రాయప్ప, విల్సన్, వరప్రసాద్, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు.