కృష్ణ

ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ పథకాల సమాచారం ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 8: ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజా ప్రతినిధులకు తెలియచేయడంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పీ స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక ఎంతో మంది పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని విధిగా ప్రజా ప్రతినిధులకు తెలియ చేసి వారి ద్వారా ప్రజల్లోకి వెళ్ళే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, స్ర్తి శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక అంశాలకు సంబంధించి 2, 4, 5, 1, 7 స్థారుూ సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు జరగాలన్నారు. పోషకాహార లోపం, వ్యాధులకు గురైన విద్యార్థులను గుర్తించి వారికి సకాలంలో వైద్యం చేయించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉందన్నారు. కానీ రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు రికార్డులకే పరిమితమవుతున్నాయని, ఎక్కడా చెకప్‌లు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని ఆమె ఆరోపించారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన 150 పడకల మాతా శిశు విభాగం ప్రారంభోత్సవంలో జరుగుతున్న జాప్యంపై సంబంధిత అధికారులపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్ళదీస్తున్నారే గానీ ప్రారంభోత్సవం మాత్రం చేయడం లేదన్నారు. పది రోజుల్లో లిఫ్టు ఏర్పాటు చేస్తామని అదనపు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉందని అధికారులు తెలపగా దీనిపై సంబంధిత ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 మంది కామన్ రివ్యుమిషన్ బృందం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసిందని సూపరింటెంటెండ్ డా. జయకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచేందుకు మార్గాలు అనే్వషించాలన్నారు. విజయవాడ, మచిలీపట్నంలోని జెడ్పీ స్థలాల్లో కనె్వన్షన్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బిఓటి పద్ధతిని వీటిని నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ ముఖ్య కార్య నిర్వహణాధికారి దామోదర నాయుడు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, జెడ్పీటిసిలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.