కృష్ణ

క్షేత్రస్థాయిలో కేంద్ర పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, నవంబర్ 8: కేంద్ర ప్రభుత్వం అమలుపర్చే పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుతెన్నులు పరిశీలించేందుకు మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన సిఆర్‌ఎం కేంద్ర కమిటీ సభ్యుల బృందం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. డాక్టర్ సక్సేనా, డాక్టర్ అనురాధల నేతృత్వంలో 9 మంది సభ్యుల బృందం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, ఆపరేషన్ థియేటర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సక్సేనా, డాక్టర్ అనూరాధలు మీడియాతో మాట్లాడుతూ నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. శిశుమరణాల సంఖ్య పూర్తిగా తగ్గించేందుకు కృషి జరుగుతుందన్నారు. జిల్లా ఆసుపత్రులు, సబ్ సెంటర్‌లలో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోతున్నాయా లేదా? ఇంకా నిధులు అవసరమా అనే విషయాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగమల్లేశ్వరితో బృందం సమీక్షించారు. జాతీయ హెల్త్ ప్రొగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం కృష్ణా, కడప జిల్లాలకు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. దేశం మొత్తంలో 18 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసిందన్నారు. 18 రకాల శాఖల నుండి 18 మంది టీం సభ్యులను కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నియమించినట్లు వారు పేర్కొన్నారు. 18 మంది టీం సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి, జిల్లాలోని ఆసుపత్రులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందంలో డాక్టర్ దీపక్, డాక్టర్ కుమార్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ టివిఎస్‌ఎన్ శాస్ర్తీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు.