కృష్ణ

రైతు శ్రేయస్సే మోదీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, నవంబర్ 14: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు డి పురంద్రీశ్వరి అన్నారు. సోమవారం గన్నవరంలో జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైరాశ్యంలో కూరుకుపోయిన రైతన్నల కోసం కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు సర్జికల్ స్ట్రైక్‌తో తగిన గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో నల్ల ధనాన్ని వెలికి తీసే చర్యలకు అమలు చేస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ చర్యలపై దేశంలో సానుకూల దృక్పథం ఏర్పడిందని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో రైతు మహాసభ నిర్వహిస్తున్నామని, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల కోసం ఈ రోజు సమీక్షించినట్లు ఆమె తెలిపారు. ఈ- మార్కెటింగ్, ఫసల్ బీమా యోజన, వేపపూత యూరియా వంటి చర్యలతో రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకున్న ఘనత బిజెపికే చెందుతుందని ఆమె అన్నారు. జిల్లా బిజెపి అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుండి 10వేల మంది రైతులను అమిత్‌షా సభకు సమీకరించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. బిజెపి నాయకులు తుమ్ముల అంజిబాబు, నాదెండ్ల మోహన్, షేక్ బాజీ, సిగ్గుర్తి శ్రీనివాసరావు, మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, వేమ, డివిడి కుమార్, దారం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.