కృష్ణ

కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, నవంబర్ 15: దేశంలో అవినీతిని అంతం చేసేందుకు, నల్లధన ప్రవాహాన్ని నిరోధించేందుకు, ఉగ్రమూకల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే రూ. 500, రూ. 1000లు వంటి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మంత్రి కామినేని, ఏలూరు ఎంపి మాగంటి బాబుతో కలిసి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత ఆటపాకలో రూ. 47 లక్షలతో నూతనంగా నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం రైల్వేస్టేషన్ రోడ్డులో రూ. 2 లక్షల పంచాయతీ నిధులు, రూ. 2.40 లక్షలు ఎన్‌ఆర్‌జిఎస్ నిధులు, రూ. 2.40 లక్షల జిల్లా పరిషత్ నిధులు వెరసి రూ. 6.80 లక్షలతో నూతనగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును మంత్రి కామినేని, ఎంపి బాబు, కమ్మిలి విఠల్‌రావులు ప్రారంభించారు. తరుపరి కైకలూరు పంచాయతీ వాటర్ ట్యాంక్ వద్ద రూ. 1,90 కోట్ల అంచనాతో నిర్మించతలపెట్టిన ర్యాపిడ్ శ్యాండ్ ఫిల్టర్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవేనని, వాటిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని, త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నామని, కాంట్రాక్టర్లు నాణ్యతకు పెద్దపీట వేయాలని, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను గతంలో ఒక రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తే 12 అంగుళాల రోడ్డు వేయాల్సి ఉండగా 6 అంగుళాల రోడ్డు మాత్రమే ఉందని, ఇది ఏమని కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే కొంతమంది అధికారులకు, రాజకీయ ప్రముఖులకు, నా లాభం కలిగితే 6 అంగుళాలు సరిపోయిందని, మంత్రి, ఎమ్మెల్యేలకు, ఎంపిలకు సొమ్ము చెల్లంచని కారణంగా ఈ 6 అంగుళాల మందం రోడ్డును వేశానని, వారికి కూడా చెల్లిస్తే రోడ్డు నిర్మాణమే ఉండదని కాంట్రాక్టర్‌కు చెప్పారని ఒక పిట్టకథగా వివరించారు. కైకలూరు సర్పంచ్ నర్సిపిల్లి అప్పారావు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఎంపిపి బండి సత్యవతి, జడ్పీటిసి బొమ్మనబోయిన విజయలక్ష్మి, ఆర్డీవో ఎం చక్రపాణి, వైస్ ఎంపిపి ఎంఎ రహీం తదితరులు పాల్గొన్నారు.