కృష్ణ

నూజివీడు చేరిన సాగర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, నవంబర్ 20: నాగార్జున సాగర్ జలాలు నూజివీడుకు చేరుకున్నాయి. నూజివీడు బ్రాంచ్ కాలువలో నీరు 26 కి.మీ.లు దాటి ఆదివారం మధ్యాహ్నానికి 15వ కిలోమీటరుకు చేరుకున్నాయ. నీటి సరఫరా తీరును రాష్ట్ర జల వనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, సాగర్‌రు ఇఇ అర్జునరావు, డిఇఇ శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధుల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆళ్ళ గోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా మంచినీటి ఇబ్బందులు తీర్చేందుకు సాగర్ జలాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కెఆర్‌ఎంబిని కోరారని చెప్పారు. ఆయన చొరవతోనే సాగరు జలాలు వస్తున్నాయన్నారు. మూడో జోన్‌కు 1.50 టిఎంసిల నీరు కేటాయించారని చెప్పారు. సాగర్ జలాలు సుమారు 300 కిలో మీటర్లు ప్రయాణించి, తెలంగాణ పలు అవరోధాలు అధిగమించి మన ప్రాంతానికి చేరుకున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూజివీడు బ్రాంచ్ కాలువకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నూజివీడు మేజరుకు 450 క్యూసెక్కులు, మాచవరం మేజరుకు 350 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయని, ఈ నీటితో చెరువులు నింపాలని సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు సమన్వయంతో మంచినీటి ఇబ్బందులు తీరేలా చెరువులు నింపుకోవాలని ఆళ్ల సూచించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు సాగి నాగేశ్వరరావు, సాగరు అధికారులు ఎల్ వీరభద్రం, ఎ శ్యాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.