కృష్ణ

అర్హులందరికీ అందుతున్న సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరులపాడు, నవంబర్ 21: ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని దొడ్డదేవరపాడు, వి అన్నవరం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామాల్లో కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి పాటిబండ్ల జైపాల్, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారావు, ఆయా గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
అవనిగడ్డ, నవంబర్ 21: మండల పరిధిలోని పులిగడ్డలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆక్రమణల తొలగింపునకు సోమవారం రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆక్రమణ ప్రాంతంలో రహదారి నిర్మించాల్సి ఉన్నందున ఆక్రమణలను తొలగించాల్సి వచ్చింది. ప్రొక్లెయిన్ సహాయంతో ఆక్రమణలను తొలగించారు. ఈ ఆక్రమణ ప్రాంతంలో రూ.5.9లక్షల వ్యయంతో 170 మీటర్ల సిసి రహదారిని 14వ ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులతో నిర్మిస్తారు. ఈ తొలగింపు కార్యక్రమాన్ని విఆర్‌ఓ సత్యనారాయణ, కార్యదర్శి శేషగిరిరావు, సర్పంచ్ మండలి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు మండలి శేషగిరి తదితరులు పర్యవేక్షించారు.