కృష్ణ

భూదానోద్యమ భూములను పేదలకు పంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 21: సంపన్నుల చేతుల్లో ఉన్న ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలోని 125 ఎకరాల భూదానోద్యమ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి హరినాధ్ మాట్లాడుతూ చెక్కపల్లి గ్రామంలో అంకుశరావు, సుబ్బరాజు, కొండలరావు, వీర వెంకట రాఘవరావు, కృష్ణవేణి, సావిత్రమ్మ తదితరులు 1964 సంవత్సరంలో విన్‌భాహే స్ఫూర్తితో 125 ఎకరాలు భూదాన బోర్డుకు దానంగా ఇచ్చారన్నారు. ఆ తర్వాత సేవింగ్ డిక్లరేషన్‌లో సీలింగ్ పరిధి నుండి తప్పకున్నారన్నారు. తద్వారా తమ భూములను కాపాడుకున్నారని, దానం చేసిన దాతలే భూదాన బోర్డుకు సంక్రమించిన భూములను ఇప్పటికి రెండు పర్యాయాలు పంపిణీ చేసినట్లు రికార్డులు ఉన్నాయన్నారు. ఆ భూములు ప్రస్తుతం సంపన్నుల ఆక్రమణలో ఉన్నట్లు తెలిపారు. సిపిఐ (ఎంఎల్) పోరాటాల కారణంగా ఆ భూములు వెలుగులోకి వచ్చాయన్నారు. తక్షణమే ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుని కలిసి వినతిపత్రం అందజేశారు.