కృష్ణ

బ్యాంక్ లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 22: ఇప్పటివరకు బ్యాంకుల్లో సిసి కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేశాయి. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయ పన్నుల శాఖ అధికారులు కూడా బ్యాంకుల్లో నిఘా పెట్టారు. సామాన్య ప్రజానీకం మాదిరిగా బ్యాంక్‌ల్లోనే సంచరిస్తూ ఆర్థిక లావాదేవీలపై కనే్నశారు. పరిమితికి మించి నగదు డిపాజిట్లు చేస్తున్న బ్యాంక్ ఖాతాదారులను గుర్తించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల బ్యాంక్ ఖాతాల్లో ఇబ్బడిముబ్బడిగా సొమ్ము వచ్చి పడుతోంది. కొందరు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో జమ చేసుకుంటుండగా మరికొందరు నల్లకుబేరులు ఇచ్చే పర్సంటేజీలకు ఆశపడి పెద్దమొత్తంలో నల్లధనాన్ని తమ ఖాతాల ద్వారా తెల్లధనంగా మారుస్తున్నారు. ఇది తప్పని తెలిసినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సామాన్యులు నల్లకుబేరులకు లొంగాల్సి వస్తోంది. జిల్లాలో అధిక శాతం ఖాతాల్లో నల్లధనం జమ అవుతున్నట్లు ఐటీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. 2.5 లక్షల రూపాయలకు మించి జమచేసిన ఖాతాదారుల వివరాలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు. త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చేందుకు ఐటీ శాఖ సిద్ధవౌతోంది. ఇదిలావుంటే వర్తక, వాణిజ్య ప్రముఖులు, వ్యాపారుల ఆర్థిక లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న వారి బ్యాంక్ లావాదేవీలతో పాటు పెద్దనోట్ల రద్దు తర్వాత జరుపుతున్న లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోల్డ్‌గోల్డ్ పరిశ్రమ ద్వారా ఎంతోమంది కోట్లాను కోట్లు కూడబెట్టారు. ఇక్కడ తయారయ్యే రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు దేశ, విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపుతూ ఆదాయ పన్ను ఎగవేస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా ఐటీ శాఖ దృష్టిసారించింది. కానీ చాలామంది వ్యాపారులు తమవద్ద పనిచేసే వందలాది మంది కార్మికుల ఖాతాల్లోకి తమ నల్లధనాన్ని మళ్లించి తెల్లధనంగా మార్చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఇతరత్రా వ్యాపారాలు చేసేవారు కూడా తమ నల్లధనాన్ని పనివాళ్ల ద్వారా తెల్లధనంగా మార్చేశారు. ఇలాంటి వారిని కూడా ఐటీ శాఖ వదిలేలా లేదు. అన్నివర్గాల ప్రజల బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ అధికారులు పరిమితికి మించి నగదు జమచేసిన ప్రతి ఖాతాదారుడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా జమ చేసిన సొమ్ము ఎలా వచ్చిందనేదానిపై త్వరలోనే కూపీ లాగనున్నారు. ఏదిఏమైనా చాలామంది తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాలను వాడుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఐటీ శాఖ తీసుకునే చర్యలపైనే అందరి దృష్టీ నిమగ్నమైంది.

జల్సాల కోసం వరుస చోరీలు
* బందరులోనే ఏడు దోపిడీలు
* తల్లిదండ్రులు, కుమారుని అరెస్టు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 22: స్థానిక చిలకలపూడి, ఆర్‌పేట పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిందితులను మంగళవారం ఆర్‌పేట ఎస్‌ఐ ఎండి హబీబ్ బాషా అరెస్టు చేశారు. నిందితుల్లో దంపతులు, వారి కుమారుడు వుండటం గమనార్హం. నవీన్‌మిట్టల్ కాలనీకి చెందిన దంపతులు ఐనాల కృష్ణ, చంద్ర ఇంటి అవసరాలు, జల్సాల కోసం తమ కుమారుడిని దొంగగా మార్చారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన కృష్ణ కొంతకాలంగా చిలకలపూడి, ఆర్‌పేట పోలీసు స్టేషన్‌ల పరిధిలో చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. చోరీ చేసిన సొత్తుతో జల్సాలకు అలవాటు పడిన కృష్ణ, చంద్ర తమ కుమారుడిని మరింత ప్రోత్సహించారు. పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస చోరీలపై పోలీసులు నిఘా పెంచారు. ఈనేపథ్యంలో వీరు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. ఆర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు, చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. దీంతో ముగ్గురిని ఆర్‌పేట ఎస్‌ఐ అరెస్టు చేసి వారి వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.