కృష్ణ

కవులకు పుట్టినిల్లు బందరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 4: కవులు, రచయితలకు బందరు పుట్టినిల్లని బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక మహతి లలిత కళావేదికలో నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత సమితి స్వర్ణోత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం నిర్వహించిన దొండపాటి దేవదాసు స్మారక సాహిత్య సభలో మంత్రి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు, విశ్వనాధ సత్యనారాయణ వంటి మహనీయులు నడయాడిన పుణ్యభూమి మచిలీపట్నం అన్నారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్ర సారస్వత సమితి గత 50 సంవత్సరాలుగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా ఎస్ ప్రభాకరరావు, డా. ఎన్‌వి కృష్ణారావు, డా. నూనె అంకమ్మారావు, కూచిభొట్ల చంద్రశేఖర శర్మ, వి శారదాదేవి, జె ఝాన్సీ, తూములూరి రాజేంద్రప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు. సాయంత్రం నిర్వహించిన డా. బోయిన వెంకటేశ్వరరావు స్మారక సభలో డా. ఎం వెంకట సత్యనారాయణ, సర్వా లలిత కుమారి, మద్దుల గిరీష్ కుమార్, డా. సాయిప్రసాద్, పేర్నేటి గంగాధరరావు, పన్యారం సాంబశివరావు, ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కొట్టి రామారావు, కొల్లూరి రామమోహనరావు, వి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఘంటసాలకు ఘన నివాళులు
మోపిదేవి, డిసెంబర్ 4: గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను ఆదివారం ఆయన స్వగ్రామమైన టేకుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఘంటసాల విగ్రహానికి విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానంద స్వామీజీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఘంటసాల దివిసీమ వాసి కావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి సుబ్బారావు, శివ నాగేశ్వరరావు, చిరువోలు బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

మోదీపై విపక్షాలది తప్పుడు ప్రచారం
మైలవరం, డిసెంబర్ 4: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తీసుకున్న పెద్న నోట్ల నిర్ణయంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని భారతీయ జనతాపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ళ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దు, బంగారంపై నియంత్రణ వంటి నిర్ణయాలతో పేదలు, సామాన్యుల నుండి మోదీకి ప్రశంసలు లభిస్తుంటే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. ముఖ్యంగా పన్ను ఎగవేతదారులకు ఈనిర్ణయం మింగుడుపడటం లేదన్నారు. అక్రమార్కులు తమ నల్లధనాన్ని బంగారంగా మార్చుకునే ఆలోచనకు అడ్డుకట్ట వేసేందుకు మోడీ బంగారంపై ఆంక్షలు విధిస్తే కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు మహిళలకు తప్పుడు సంకేతాలిస్తూ మోడీని బదనాం చేయటానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వంగా వచ్చిన బంగారం, ఆదాయం ద్వారా, వ్యవసాయాధారం ద్వారా వచ్చిన బంగారంపై ఎటువంటి ఆంక్షలు లేవని, బంగారం కొనుగోలుకు సంబంధించిన రుజువులు చూపినట్లైతే ఎటువంటి ఆంక్షలు లేవని దీనిపై ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన వివరించారు. ఈవిషయాలను కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈసమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, పార్టీనాయకులు వజ్రాల వెంకట కృష్ణారెడ్డి, శివారెడ్డి, జె శేఖర్, నరేంద్ర, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.