కృష్ణ

బ్యాంకుల వద్ద తీరని వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 5: మండలంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు కష్టాలు తీరటం లేదు. పెద్దనోట్ల రద్దు జరిగి 28 రోజులు కావస్తున్నా ప్రజలు నరకయాతన పడుతున్నారు. సోమవారం మండలంలోని బ్యాంకులు ఖాతాదారులతో కిక్కిరిసిపోయాయి. అయితే బ్యాంకు అధికారుల ఛీత్కారాలు ఖాతాదారులకు ఎదురవుతున్నాయి. కార్పొరేషన్ బ్యాంకులో రూపే కార్డుల కోసం ఉదయం నుంచి మహిలలు సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇతర గ్రామాల నుంచి పిల్లలతో వచ్చిన మహిళలు ఆకలికి ఆలమటించారు. సాయంత్రం 4 గంటల తరువాత కార్డులు ఇస్తామని అధికారులు చెప్పటంతో బ్యాంకువద్ద అరుగులపై పడిగాపులు కాశారు. అలాగే యూకోబ్యాంకులో ఖాతాదారులను పురుగులు చూసినట్టు చూస్తున్నారని పలువురు ఆరోపించారు. ఓ మహిళా అధికారి నిర్లక్ష్యంగా చిన్నచూపు చూస్తున్నారని రైతులు, మహిళలు తెలిపారు. ఏ విషయం అడిగినా ఆమె సరైనా సమాధానం చెప్పకుండా ఛీదరించుకుంటున్నారని చెప్పారు. అలాగే పింఛన్ వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉండగా రూ.500 మించి ఇవ్వటం లేదని పింఛన్‌దారులు తెలిపారు. ఇక సప్తగిరి గ్రామీణ బ్యాంకులో అయితే ఖాతాదారులకు సరైన సేవలు అందటం లేదని అంటున్నారు. పింఛన్ సొమ్ము రూ.300లకు మించి ఇవ్వటం లేదన్నారు. అలాగే ఏటీఎంల వద్ద డబ్బు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు తెలిపారు. బ్యాంకులకు వెళితే రూ.2వేల నోటు మాత్రమే ఇస్తున్నట్టు రైతులు తెలిపారు. వ్యవసాయ పనులకు ఈ రెండువేలను ఎలా చెల్లించగలమని రైతులు అంటున్నారు. తోట్లవల్లూరు బ్యాంకుల్లో రెండు వేలనోట్లు కాకుండా రూ.100,రూ.50 నోట్లు ఎక్కువ సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, కూలీలు కోరుతున్నారు.

75 శాతం సబ్సిడీపై జొన్నవిత్తనాల పంపిణీ
కూచిపూడి, డిసెంబర్ 5: వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు పశు సంవర్ధక శాఖ 75 శాతం సబ్సిడీపై జొన్న విత్తనాలు అందచేస్తున్నట్లు మొవ్వ మండల వ్యవసాయ అధికారి డా. వెంకట్రావ్ తెలిపారు. కోసూరు గ్రామంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ మండలంలోని వేములమడ గ్రామాన్ని ఆరు నెలలు తమ శాఖ దత్తత తీసుకుని పశు సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భట్లపెనుమర్రు, పెదపూడి, కాజ, మొవ్వ, చినముత్తేవి, పెదపూడి పశు వైద్యశాలలకు రూ.60వేల 630 విలువ గల 215 కిట్లను రూ.15వేల 265లకే సరఫరా చేసినట్లు తెలిపారు.