కృష్ణ

కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 5: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 19వతేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ స్వీయ పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించారు. తెల్లవారు ఝామున ప్రారంభమైన ఈ పరీక్షలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. సుమారు 300 మంది పైబడి అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు క్వాలిఫైడ్ సర్ట్ఫికెట్లను అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విడత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. రాడార్ ఫీక్వెన్సీ ఐడెంటిటీ డివైజ్ (ఆర్‌పిఎఫ్) పద్ధతిలో 600, 100 మీటర్ల పరుగు పందెం, ఛాతీ, ఎత్తు కొలతలను పరీక్షించారు. తొలుత సర్ట్ఫికేట్స్ వెరిఫికేషన్ జరిగింది. ఆ తర్వాత అభ్యర్థుల నుండి వేలిముద్రలు సేకరించారు. ఛాతీ, ఎత్తు కొలతలను తీసుకున్న అనంతరం 600 మీటర్లు, లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి స్థాయి పారదర్శకంగా అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. హాల్ టిక్కెట్లలో పొందుపర్చిన తేదీల ప్రకారం అభ్యర్థుల అన్ని ధృవీకరణ పత్రాలన్నింటితో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. బందరు, అవనిగడ్డ డియస్‌పిలు శ్రావణ కుమార్, సయ్యద్ ఖాదర్ బాషా అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

పెద్దనోట్ల రద్దుతో దేశం పురోభివృద్ధి
* కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి
పామర్రు, డిసెంబర్ 5: దేశ పురోభివృద్ధికి పెద్దనోట్ల రద్దు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని కురుమద్దాలి గ్రామానికి సోమవారం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అవినీతిపరులు కూడబెట్టిన నల్ల ధనం వెలికి తీతకు నోట్ల రద్దు ఉపయోగపడుతుందన్నారు. విజిలెన్స్ కమిషన్ నల్లధనంపై నిరంతర ప్రక్రియగా చర్యలు చేపడుతూనే ఉందన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో కొంత మేరకైనా భాగస్వాములు కావాలన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో మంచి సమాజ నిర్మాణానికి అందరూ సాంఘీక బాధ్యతగా కృషి చేయాలన్నారు.