కృష్ణ

15 నుండి బందరులో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 6: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో క్రీడలను ప్రోత్సహించేందుకు గాను ఈ నెల 15, 16, 17తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణపై మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విద్యా సంస్థల వ్యాయామోపాధ్యాయులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అండర్-19 బాలుర, బాలికల విభాగంలో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు 13 జిల్లాల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొనన్నుట్లు చెప్పారు. హిందూ కళాశాల, నోబుల్ కళాశాల క్రీడా మైదానాలతో పాటు ఆంధ్ర జాతీయ కళాశాలలో రెండు మైదానాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సికె నాయుడు పుట్టిన బందరులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బందరు పోర్టు, పోర్టు సిటీ, పారిశ్రామికవాడ ఏర్పాటు, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న బందరులో ఈ క్రికెట్ టోర్నీ నాంది కాబోతుందన్నారు. ఈ సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సరస్వతి దేవి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వ్యాయామోపాధ్యాయులు మురళి, శ్రీనివాసరావు, అజయ్, రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు గొరిపర్తి పాపరాజు, రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం డైరెక్టర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.