కృష్ణ

బడి రుణం తీర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 8: ‘బడి రుణం’ తీర్చుకుందాం అంటూ పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గురువారం అవనిగడ్డ ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనం చదువుకోవాలి, బడి అమ్మ ఒడిలాంటిది. ముందు మనం స్పందిద్దాం, ఇతరులకు స్ఫూర్తినిద్దాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థులు బడి రుణం తీర్చుకునేందుకు తమవంతు సహకారాన్ని అందించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యాలయాల ప్రతినిధులు తెలిపారు. ఈ ర్యాలీలో ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిభా పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం

కూచిపూడి, డిసెంబర్ 8: స్వామి వివేకానంద 154వ జయంతి సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన ప్రతిభావంతులకు ప్రతిభా రత్న పురస్కారాలు అందచేయనున్నట్లు అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాంతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ 2017 జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో విశాఖపట్నంలో సెమినార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయ కళలు, క్రీడలు, సమాజసేవ, విద్య, వైద్యం, విధి నిర్వహణ, ఉపాధి కల్పన రంగాలలో ప్రతిభ కనబర్చి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులు ఈనెల 16వ తేదీలోగా సంబంధిత ఆధార పత్రాలను, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలను అందచేయాలన్నారు. విజయ్ జి కుమార్, డోర్ నెం.18/93/1, సత్య శ్రీనివాస ఎన్‌క్లేవ్ ఆదిత్యనగర్, మదురవాడ, విశాఖపట్నం 48 చిరునామాకు అందచేయాలన్నారు.

సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి

జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 8: భారతదేశం విశిష్టమైన దేశమని, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నతమైనవి అయినందు వల్లనే ఇతర దేశాలు ఆచరించి ఆదరిస్తున్నారని తాత్వికులు గెంటేల వెంకట రమణ అన్నారు. గురువారం మండలంలోని బలుసుపాడు శ్రీగురుథామ్‌లో సద్గురు కందుకూరి శివానందమూర్తి వారి జన్మదిన నక్షత్రాన్ని ఘనంగా నిర్వహించారు. శివానంద భక్తబృందం ఆధ్వర్యంలో ఉదయం ఆశ్రమంలో కొలువై ఉన్న సద్గురు కాంశ్య విగ్రహానికి వెంకట రమణ వసంత లక్ష్మి దంపతులతో పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, పలువురు ఫ్రముఖులు, భక్తులు అభిషేకాలు, పుష్పాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్చారణల మధ్య నిర్వహించిన హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాల్లో వెంకట రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సత్సంగంలో భారతదేశ ఉన్నతిని, గురువుల ప్రాముఖ్యతను వెంకట రమణ భక్తులకు వివరించారు. గురువును బయట ఆరాధన చేయాలని, అంతరంగంలో అవగాహన చేసుకోవాలన్నారు. సమాజంలో ధర్మంగా ఉండటం గురువును పూజించినంద ఫలితంగా వర్ణించారు. గురువును విశ్వసించడం ద్వారా తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరి అంతరాల్లో గురువు ప్రతిరూపంగా ఉంటారని అన్నారు.
జీవితంలో ప్రతి ఒక్కరూ సంతోషం కావాలని కోరుకుంటారని, గురువు ఆనంద రూపంలో ఉంటారని అన్నారు. సద్గురు శివానందమూర్తి వారు కోరుకున్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించి దర్మంతో పాటు దేశ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో పలు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.