కృష్ణ

స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 8: ప్రైవేట్ స్కూల్ బస్ వేగానికి ఓ చిన్నారి బలైన ఘటన గురువారం ఉదయం తోట్లవల్లూరు జెడ్‌పి రోడ్డులో జమ్మిచెట్టు వద్ద చోటు చేసుకుంది. మరో చిన్నారికి కాలు గాయంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. వివరాల్లోకి వెళితే కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి శివనాగప్రసాద్, రమాదేవికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శివనాగప్రసాద్ తాపీ పని చేస్తుంటాడు. ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. భార్య రమాదేవి ఐదు రోజులు ఇంటిలో ఉండని పరిస్థతి వచ్చింది. దీంతో రమాదేవి బుధవారం తమ కుమార్తె వీరంకి మోక్ష లక్ష్మి ప్రణతి (6)ని తీసుకుని తోట్లవల్లూరులో తన తల్లి పడమట మంగమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో లక్ష్మి ప్రణతి మరో బాలిక మోరాల ఝాన్సీరాణి ఇద్దరు రోడ్డుపైకి వచ్చారు. అదే సమయంలో ఉయ్యూరుకు చెందిన ఉయ్యూరు ఇంగ్లీషు మీడియం స్కూల్ బస్సు జెడ్‌పి రోడ్డులోని విద్యార్థులను ఎక్కించుకుని విద్యుత్ సబ్ స్టేషన్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వేగంతో వస్తుండగా లక్ష్మి ప్రణతి, ఝాన్సీరాణి రోడ్డు పక్కన ఉన్నారు. డ్రైవర్ చిన్నారులను చూసుకోకుండా వేగంగా దూసుకురావటంతో లక్ష్మి ప్రణతి బస్సు ముందు చక్రం వద్ద పడిపోయంది. చక్రం తలపైకి ఎక్కటంతో తల ఛిద్రమై మృతి చెందింది. మరో బాలిక ఝాన్సీరాణి కుడికాలుపై బస్సు చక్రం ఎక్కింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు. లక్ష్మి ప్రణతి మృతదేహం వద్ద తల్లి బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రసాద్ సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కిలారపు రవిని పోలీసులు అదుపులో తీసుకుని స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు.

వివాదాస్పదంగా మారిన పైడమ్మ అమ్మవారి జాతర బహిరంగ వేలం
పెడన, డిసెంబర్ 8: ఈనెల 13వ తేదీ నుంచి 11 రోజులు పాటు జరగనున్న శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల దుకాణాల బహిరంగ వేలం పాట వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి ఈ పాటలను నిర్వహించారు. అయితే అధికారులు నిబంధనలను అతిక్రమించి పాటలు జరిపారని, ఇందులో పాల్గొన్న పోటీ పాటదారులు మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ రాజమండ్రికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆ పాటను రద్దు చేసి తిరిగి పెట్టాలని వారు కోరారు. ఆలయం వద్ద 11 రోజులు పాటు ఏర్పాటు చేసే షాపుల నుంచి ఆశీలు వసూలు చేసుకునేందుకు గాను పురపాలక సంఘం ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహిస్తారు. గత సంవత్సరం రూ.5లక్షల 36వేల ఆదాయం లభించింది. ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాల సరాసరి పాటను బట్టి తుమ్మల నాగేంద్రం అనే కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల 98వేలకు పాటను కొట్టివేశారని పోటీ పాటదారులు వాహబ్ ఖాన్, అతావూర్ రహ్మాన్‌లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 11.30గంటల వరకు పాటలు జరిపారని, అలాగే కార్యాలయ పని వేళలు ముగిసిన తరువాత ధరావత్తులు కట్టించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమీషనర్, మున్సిపల్ ఛైర్మన్‌లు పక్షపాతంగా వ్యవహరించి నాగేంద్రంకు పాట వచ్చే విధంగా ప్రయత్నించారని వీరు ఆరోపించారు. ఈ పాటను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు మొవ్వ, కాజ విద్యార్థులు

కూచిపూడి, డిసెంబర్ 8: ఖేలో ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర స్థాయి జట్టుకు మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దయాళ్ వీర వెంకట్ ఎంపికయ్యాడు. అలాగే మండలంలోని కాజ జడ్పీ పాఠశాల విద్యార్థిని నందం భవ్యసాయి అండర్-14 వాలీబాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రీడాకారులను గురువారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంవిఎస్ దుర్గాప్రసాద్, ఎఎస్‌వి ప్రసాద్, పిడిలు కె పూర్ణచంద్రరావు, ఎల్ పూర్ణ, పిఇటి వేముల వెంకటేశ్వరరావు అభినందించారు. ఈనెల 7న ఉయ్యూరులో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇరువురు విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా కడప జిల్లా రాజంపేటలో ఈనెల 22న జరిగే వాలీబాల్ పోటీల్లో తమ విద్యార్థి పాల్గొంటుందని హెచ్‌ఎం ప్రసాద్ తెలిపారు.
నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసుకోండి