కృష్ణ

పెళ్ళి బృందంతో ట్రాక్టర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 10: పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని నిడుమోలు శివారు యలకుర్రు-కోరిమెర్ల రహదారిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. ఘంటసాల మండలం మల్లంపల్లికి చెందిన యువతి వివాహం శుక్రవారం రాత్రి గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ ఆలయం వద్ద జరిగింది. మల్లపల్లం శ్రీనివాసరావుకు చెందిన ఎపి 16టిఎ 6428 ట్రాక్టర్‌లో శుక్రవారం రాత్రి వెళ్ళారు. వేడుక ముగించుకుని శనివారం తెల్లవారు జామున తిరిగి వెళుతుండగా అదుపు తప్పిన ట్రాక్టర్ చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ హుటాహుటిన మచిలీపట్నం తరలించారు. గొరిపర్తి కనకదుర్గ, గొరిపర్తి సతీష్‌లను విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌కు తరలించారు. గొరిపర్తి నాగేశ్వరరావు, కృష్ణవేణి, జయలక్ష్మి, సతీష్, గంగమ్మ, రేణుకమ్మ, సీత, డొక్కు గంగమ్మ, లలిత, మణికంఠ, పవన్ కుమార్, భాగ్యలక్ష్మి, నాంచారమ్మ, పి బసవరాజ్యం, ఎన్ కృష్ణకుమారి మచిలీపట్నంలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూచిపూడి పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందా..? పామర్రు పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందా..? అనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. తొలుత పామర్రు ఎస్‌ఐ అభిమన్యు ఘటనా స్థలికి వచ్చారు. ఆ తర్వాత కూచిపూడి ఎఎస్‌ఐ మధుసూదనరావు సిబ్బందితో ఆ ప్రాంతానికి వచ్చారు. నిడుమోలు, యలకుర్రు విఆర్‌ఓల ద్వారా రికార్డు పరిశీలించి చివరకు కూచిపూడి స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు. ఈ మేరకు కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్యాష్‌లెస్‌గా టోల్‌ప్లాజాలను
క్రాస్ చేయనున్న హెచ్‌పిసిఎల్ ట్రక్కులు
జి.కొండూరు, డిసెంబర్ 10: భారత ప్రధాని నరేంద్రమోదీ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు హెచ్‌పిసిఎల్ క్యాష్‌లెస్ విధానంతో ట్యాంకు ట్రక్కులను టోల్‌ప్లాజాల వద్ద క్రాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. నగదు రహిత లావాదేవీల విధానాన్ని విజయవాడ ఆర్‌టిఒ ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్‌పిసిఎల్ చీఫ్ మేనేజరు కెకె కిషోర్ శనివారం కట్టుబడిపాలెంలోని హెచ్‌పిసిఎల్ ప్లాంటులో ప్రారంభించారు. ఇకపై ఆర్‌ఎఫ్‌ఐడి ఫాస్ట్ ట్యాగ్ కలిగిన హెచ్‌పిసిఎల్ ట్యాంకు ట్రక్కులు, ఏవియేషన్ సర్వీసెస్ (శంషాబాద్, గన్నవరం, రేణిగుంట ఎయిర్‌పోర్టులు), డైరెక్ట్ సేల్స్ కస్టమర్స్ (ఆర్‌టిసి, సింగరేణి)కు పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద నగదు రహితంగా నడవనున్నాయి.