కృష్ణ

అందరికీ అజ్మీర్ షరీఫ్ బాబా ఆశీస్సులు లభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 12: అజ్మీర్ షరీఫ్ బాబా ఆశీస్సులు అందరికీ లభించాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పట్టణం నుండి అజ్మీర్‌కు వెళ్లే ప్రత్యేక రైలును మంగళవారం మంత్రి రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ముస్లింలు అందరూ సుఖ సంతోషాలతో సమైక్యంగా మెలగాలని కోరు తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది అజ్మీర్‌కు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అజ్మీర్ షరీఫ్ బాబాను దర్శించుకునే ముస్లింలకు ఇది ఎంతో ఉపయోగమన్నారు. రాబోయే కాలంలో బందరు, గుడివాడ రైల్వేలైన్ డబ్లింగ్ పనులు సకాలంలో పూర్తికావాలని, మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామిక, ఆర్థిక ప్రాంతం గా అభివృద్ధి చెందాలని, రోల్డ్‌గోల్డ్ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలని కోరుతూ ముస్లింలు ప్రార్థనలు జరపాలని కోరారు. అజ్మీర్ షరీఫ్ బాబా ఆశీస్సులు కోరుతూ మంత్రి చాదర్ పంపించారు. తొలుత మంత్రి నివాసం వద్ద నుండి రైల్వేస్టేషన్ వరకు ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎఎంసి ఛైర్మన్ గోపు సత్యనారాయణ, పట్టణ టిడిపి అధ్యక్షులు ఇలియాస్ పాషా, మైనార్టీ నాయకులు అమీర్‌బాబు, సయ్యద్ ఖాజా, ఖాజీ పహల్వాన్ ఖాన్, షేక్ బాజానీ, అబ్దుల్ అజీమ్, ఎండి కరీమ్ బాషా, అబ్బాస్, షేక్ ఫిరోజ్, బారీ పాల్గొన్నారు.