కృష్ణ

మానవాళికి మార్గదర్శకం ‘్భగవద్గీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): భగవద్గీత సర్వమానవాళికి మార్గదర్శకమని పెదముత్తేవి ముముక్షుజన మహా పీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు అన్నారు. శనివారం స్థానిక జవహర్ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన త్రయోదశ గీతా జయంతి వార్షిక మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుదేవులు అనుగ్రహభాషణ చేస్తూ ప్రతి సమస్యకు భగవద్గీత పరిష్కారం చూపుతుందన్నారు. గీతా పఠనం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుందన్నారు. కుటుంబ సభ్యులు, సమాజంలో మెలగాల్సిన తీరును తెలియజేస్తూ నైతిక విలువలను పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా గీతాపఠనం తీర్చిదిద్దుతుందన్నారు. అనంతరం పి ఆంజనేయ కుమార్ నేతృత్వంలో భగవద్గీతలోని 18 అధ్యాయాలను విద్యార్థులు పారాయణ చేశారు. ప్రిన్సిపాల్ వివి శివ ప్రసాద్-లక్ష్మీ దంపతులు నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్ర అధికారి సిహెచ్ సూర్యప్రకాశరావు, అప్సా స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు వి సుందరరాం, కౌన్సిల్ మెంబర్ బి హనుమంతరావు, ఎవిజి గౌరీప్రసాద్, దిలీప్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

ఉనికి కోసమే ఆరోగ్యశ్రీపై ఆరోపణలు

పామర్రు: రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పూర్తి స్థాయి రోగులకు అందుతున్నాయని కేవలం పార్టీ ఉనికి కోసం ప్రతిపక్ష వైకాపా నేత జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు. శనివారం స్థానిక విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 266 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేలా పని చేశారని, తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత 1044 రోగాలకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి 2 శాతం మాత్రమే నిధులు కేటాయించగా తమ ప్రభుత్వం 5 శాతం కేటాయిస్తుందని వివరించారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలను ఆధునికీకరించి మెరుగైన సౌకర్యాల కల్పించి కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తెల్లకార్డు ఉన్న వారందరికీ వైద్యసేవలు అందిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్‌కార్డులు రేషన్‌షాపుల ద్వారా సరఫరా చేస్తున్నామని అన్నారు. డయాలసిస్, డెంగ్యూ జబ్బులకు కూడా ఉచిత సేవలు అందిస్తున్నామని అన్నారు. కేవలం ప్రతిపక్ష నేత పార్టీ ఉనికి కోసమే ఏదో ఉద్యమం చేపట్టాలని ఉద్దేశ్యంతో ఆరోగ్య శ్రీ అమలుపై అనవసరమైన రాద్దాంతం సృష్టిస్తుతున్నాడని పేర్కొన్నారు. నూతన అమరావతి, మంగళగిరి వద్ద జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థను, అధునాత ఆసుపత్రిని నిర్మించే యోచనలో చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. వర్లతోపాటు తెదేపా మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కుదరవల్లి ప్రవీణ్, పరసా సుబ్రహ్మణ్యం, జిల్లా బిసి సంఘ నేత దాలిపర్తి ప్రసాద్, మార్కెట్‌యార్డు చైర్మన్ మండపాక శంకరబాబు పాల్గొన్నారు.